
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీలను సంఘటిత పరిచి ఐక్య ఉద్యమాలు చేపట్టేందుకు ఈ నెల 27న వరంగల్‌లో దళిత, గిరిజన సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్ గాలి వినోద్‌కుమార్ అధ్యక్షతన దళిత మేధావుల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ మాట్లాడుతూ.. మేధావుల మౌనం దళిత జాతికి ప్రమాదమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణమన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు నేత చెన్నయ్య, జేబీ రాజు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామిమాదిగ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment