
సాక్షి, వరంగల్: ఈనెల 8వ తేదీన వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జరప తలపెట్టిన బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న నేపథ్యంలో ఆ సభను కూడా విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ వేదికగా జరిగిన సభను విజయవంతం చేసినందకు మోదీ శభాష్ అన్నారని, మళ్లీ శభాష్ అనిపించేలా సభ ఉండాలని బండి సంజయ్ పేర్కొన్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విరుచుపడ్డారు.
‘కేసీఆర్ అంటే మోసం..బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాఁం బీజేపీ. మోదీజీ మన బాస్. బీజేపీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరో ఇద్దరో చేరినంత మాత్రాన ఆ పార్టీకి సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదు. హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాలేదు. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేదల సంక్షేమమే బీజేపీ ఎజెండా. బీఆర్‌ఎస్ గడీలను బద్దలు కొట్టేదే బీజేపీనే.కాంగ్రెస్‌ను పట్టించుకోవాల్సిన అసవరం లేదు. అంతా కష్టపడి పనిచేసి సభను సక్సెస్ చేయాలి’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment