
హైదరాబాద్ : ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు మంగళవారం బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి పది రోజులకోసారి కార్ఖాన, రాంగోపాల్ పేట్ పీఎస్ లో హాజరు కావాలని షరతు విధించింది. ఇద్దరు వ్యక్తులతో పదివేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.