చంద్రబాబూ ఇక కాచుకో... | MRPS leader ramanaiah cm chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ ఇక కాచుకో...

Published Thu, Apr 28 2016 10:00 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM

చంద్రబాబూ ఇక కాచుకో... - Sakshi

చంద్రబాబూ ఇక కాచుకో...

నెల్లూరు(సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెన్ని రమణయ్య సవాల్ విసిరారు. నెల్లూరులోని అంబేడ్కర్ భవన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలను అవసరానికి ఉపయోగించుకుని, అవసరం తీరాక పక్కన పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ టీడీపీతోనే సాధ్యమని మాదిగలను నమ్మించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు.

ఈ నెల 30న అనంతపురంలో జరిగే మాదిగల దండయాత్ర మహాసభ ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామన్నారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సభ ద్వారా మాదిగల సత్తా చాటి, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ కో కన్వీనర్ ఏళిషా కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దెపూడి గిరి, జిల్లా అధ్యక్షుడు మందా రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement