ramanaiah
-
AP: ఎమ్మార్వో రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల సాయం
సాక్షి, విశాఖ: హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో కంబైన్డ్ డీడ్ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇదీచదవండి.. బరి తెగించిన ఎర్ర చందనం స్మగ్లర్లు -
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్
విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారాంను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు. నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. ‘‘విశాఖ రూరల్ ఎమ్మర్వో రమణ హత్య కేసులో నిందితుడి మురారి సుబ్రహ్మణ్యం గంగారావుని అరెస్ట్ చేశాం. చెన్నై పోలీసుల సహకారం తో నిందితుడ్ని అరెస్ట్ చేయగలిగాం. హత్య అనంతరం నిందితుడు విమానంలో బెంగుళూర్ పరారయ్యాడు. అక్కడి నుంచి బస్‌లో చెంగల్పట్టు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. ఆపై నిందితుడిని విశాఖ తీసుకొచ్చాం. నిందితుడిపై విజయవాడ, హైదరాబాద్‌లో చీటింగ్ కేసులున్నాయ్. .. నిందితుడ్ని పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలు శ్రమించాయి. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తోంది. కంబైన్డ్ డీడ్ చేయడంలో ఎమ్మార్వో జాప్యం చేయడంతోనే చంపినట్లు నిందితుడు చెబుతున్నాడు. అతన్ని పూర్తిగా విచారించాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని సీపీ తెలిపారు. ఇదిలా ఉంటే.. విశాఖలో ల్యాండ్ వివాదాలపై ఇక నుంచి ప్రతివారం విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ల్యాండ్ ధరలు పెరిగిన దశలో సహజంగా వివాదాలు తలెత్తుతున్నాయని.. అందుకే కలెక్టర్ సహకారంతో ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటామని అన్నారాయన. -
లారీ బోల్తా..ఇద్దరి మృతి
దక్కిలి మండలం మార్లగుంట సమీపంలో లారీ బోల్తాపడింది. వైఎస్సార్ జిల్లా చిట్వేల్ నుంచి వెంకటగిరికి ధాన్యం లోడుతో వస్తోన్న లారీకి మార్లగుంట సమీపంలోకి రాగానే గేదె అడ్డువచ్చింది. దానిని తప్పించబోయి లారీ పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య, యుగంధర్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబూ ఇక కాచుకో...
నెల్లూరు(సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెన్ని రమణయ్య సవాల్ విసిరారు. నెల్లూరులోని అంబేడ్కర్ భవన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలను అవసరానికి ఉపయోగించుకుని, అవసరం తీరాక పక్కన పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ టీడీపీతోనే సాధ్యమని మాదిగలను నమ్మించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఈ నెల 30న అనంతపురంలో జరిగే మాదిగల దండయాత్ర మహాసభ ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామన్నారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సభ ద్వారా మాదిగల సత్తా చాటి, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ కో కన్వీనర్ ఏళిషా కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దెపూడి గిరి, జిల్లా అధ్యక్షుడు మందా రవి పాల్గొన్నారు. -
సాహితీ బంధువు
ఆ సందర్భంలోనే సూచన అందింది. ఏటేటా ఒక తెలుగు ప్రముఖుడిని ఎందుకు సన్మానించరాదు? ఆ విధంగా 1979లో రాజా-లక్ష్మీ ఫౌండేషన్ ఏర్పడింది. మొదటి అవార్డు శ్రీశ్రీగారికి ఇచ్చారు. సజ్జన సాంగత్యం జీవన్ము క్తికి మార్గమవుతుందని మనసారా నమ్మి జీవించిన సాహితీ బంధువు రమణ య్య రాజాగారు. మిత్రు లందరికీ ఆయన రాజా గారు. ఆయన స్వతహాగా వ్యాపారి. 1963లో వ్యాపా రం కోసమే చెన్నై వచ్చారు. కానీ వ్యాపారంతో ఆగిపోలేదు. ఆనాటి సాహితీ ప్రియులకు తలలో నాలిక అయ్యారు. బీయస్సార్ కృష్ణ, ఇచ్ఛాపురపు జగన్నాథరావు, నేనూ, గొల్లపూడి రామదాసు (ఇన్‌కంటాక్స్ ఆఫీసరు) ఇలా చాలా మంది ఆయన స్నేహ బృందంలో వారం. పప్పు వేణుగోపాలరావు వారి పెద్దబ్బాయి క్లాస్మేట్. ఆయనా ఈ బృందంలో దరిమిలాను కలిశారు. 1975లో చెన్నైలో ఉంటున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి వారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా సన్మానం చెయ్యాలని సంకల్పించారు. కానీ సన్మా నాలకి దేవులపల్లి వ్యతిరేకం. అప్పుడొక మార్గాం తరాన్ని సూచించారు పాలగుమ్మి పద్మరాజుగారు. దేవులపల్లి ‘కృష్ణపక్షం’ వెలువడి అప్పటికి 50 ఏళ్లయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ‘కృష్ణ పక్ష స్వర్ణోత్సవం’ ఎందుకు జరపకూడదు? అంత వరకు ప్రచురించని వారి రచనలను ప్రచురిస్తూ సభని జరపాలని నిర్ణయించారు. ‘పల్లకీ’ అనే పేరుతో శాస్త్రి గారి కవితలు, ‘శర్మిష్ట’, ‘ధనుర్దాసు’ వంటి రేడియో నాటికలు, ‘మేఘమాల’ పేరిట శాస్త్రిగారి సినీమా పాటలు (ఈ పాటలు పుస్తకరూ పంగా రావడం అదే మొదటిసారి), ‘కృష్ణపక్షం’ మొదలైన ఆరు సంపుటాలు వెలువడ్డాయి. కృష్ణ పక్షం స్వర్ణోత్సవం వాణీమహల్లో వైభవంగా జరి గింది. ఆ సభలో నేనూ ఒక వక్తని. ఆ రుచిని మరి గిన రాజాగారికి ఆ సందర్భంలోనే సూచన అందిం ది. ఏటేటా ఒక తెలుగు ప్రముఖుడిని ఎందుకు సన్మానించరాదు? ఆ విధంగా 1979లో రాజా-లక్ష్మీ ఫౌండేషన్ ఏర్పడింది. మొదటి అవార్డు హబీబుల్లా రోడ్డులో దక్షిణ భారత కళాకారుల ఆడిటోరియంలో శ్రీశ్రీగారికి ఇచ్చారు. అచిరకాలంలో రాజాగారి అవార్డుకి ఒక గుర్తింపు, ప్రత్యేకత ఏర్పడిపోయింది. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ తమ ప్రతిభను చాటిన ఎందరో తెలుగువారిని ఈ అవార్డుతో సత్క రించారు. 1978లో ననుకుంటాను- విజయనగ రంలో రావి కొండలరావుగారి అన్నగారు ఆర్కేరావు షష్టిపూర్తి ఉత్సవాన్ని జరిపారు. ఆ ఫొటోలు నా ఆత్మకథలో ఉన్నాయి. అది చాలా పెద్ద సభ. దాశ రథి, ఆచార్య ఆత్రేయ, విద్వాన్ విశ్వం, నేనూ, బెజ వాడ గోపాలరెడ్డి - ఇలా ఎంతోమందిమో తరలి వెళ్లాం. ఆ రోజు నరాల రామిరెడ్డి అష్టావధానం నిర్వ హించారు. వ్యాపారరీత్యా విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డాక- రాజాగారి జీవితం గొప్ప మలుపు తిరిగింది. అప్ప టికే వానప్రస్థంలో పడిన ఆయన జీవితానికి చుక్కా నిలాగ సద్గురు శివానందమూర్తిగారి ఆశ్రయం లభిం చింది. ‘ఇది నా జీవితంలో దక్కిన గొప్ప అదృష్టం’ అని పొంగిపోయేవారు రాజాగారు. శివానంద మూర్తి గారి భీమిలిలోని ఆనందాశ్రమంలో ఒక ఇం టిని నిర్మించుకుని అక్కడే స్థిరపడిపోయారు. ఆయన జీవితంలో ఆ దశ అతి ప్రశాంతతని చేకూర్చిన దశ. అప్పటికే రాజాలక్షీ్ష్మ అవార్డుకి సాహితీ పురస్కా రాన్ని చేర్చారు. గురువుగారి సూచనతో ప్రతీ యేటా ఒక వేదపండితునికి వేద పురస్కారాన్ని జత చేశారు. సి. నారాయణరెడ్డి, పోణంగి శ్రీరామఅప్పారావు సాహితీ పురస్కారం, ప్రముఖ పర్యావరణ నిపుణు రాలు సునీతా నారాయణ్ - ఇంకా ఎన్నో పురస్కా రాలకు నేను వక్తను. నేదునూరి కృష్ణమూర్తిగారికి రాజాలక్ష్మీ అవార్డు ఇచ్చే సంవత్సరం నాకు ప్రత్యేక రాజాలక్ష్మీ పురస్కారం ఇచ్చారు. సద్గురువుల చేతి మీదుగా అందుకోవడం అరుదైన అదృష్టాలలో ఒకటి. ఆయన 80వ జన్మదినం సందర్భంగా డాక్టర్ జ్ఞానేశ్వర్ ఎండోమెంట్ ఫండ్‌కి అవార్డుని అందజే శారు. ఇంతేకాదు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురించారు. పప్పు వేణుగోపాలరావు ‘భజగోవిం దం’, శలాక రఘునాథశర్మ గారి ‘శివానందలహరి’, సుందరకాండ, ‘లీలాకృష్ణుడు’, ‘శ్రీమాత’ మొద లైనవి. ఆయన ఆంధ్రావిశ్వవిద్యాలయం సెనేట్ సభ్యు నిగా రెండు పర్యాయాలు, సిండికేట్ సభ్యునిగా పని చేశారు. మొన్న- చాలా నెలల తర్వాత చెన్నై వెళ్లాను. ఆ రోజు రాజాగారిని చూడాలని నేనూ, మా ఆవిడా సంకల్పించుకున్నాం. ఉదయం నుంచీ వారి అబ్బా యిలు వెంకట్రావుకీ, కృష్ణకీ కనీసం 10 సార్లయినా ఫోన్ చేసి ఉంటాను. సమాధానం లేదు. మధ్యా హ్నం బయలుదేరే ముందు మళ్లీ చేశాను. మను మడు తీశాడు. ‘‘తాతగారు పోయారండి!’’ తుళ్లిపడ్డాను. ‘‘ఎప్పుడు?’’ ‘‘ఇవాళే!’’ ‘‘మరి...మరి..’’ ‘‘మరోగంటలో ఖననం’’ టెలిఫోన్ పెట్టేసి పరుగెత్తాను. రాజాగారు నిద్ర పోతున్నారు. అత్యంత ప్రశాంత జీవనం గడిపి అల వోకగా సెలవు తీసుకున్న జీవన్ముక్తులు రాజాగారు. - గొల్లపూడి మారుతీరావు -
ప్రత్యేక హోదా కోసం మరొకరు ఆత్మహత్య
బావిలో శవమై కన్పించిన సెక్యూరిటీ గార్డు రమణయ్య ప్రత్యేక హోదా వస్తే అందరం బాగుంటామంటూ లేఖ గూడూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ ప్రైవేటు ఉద్యోగి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరువక మునుపే జిల్లాలోని గూడూరు మండలం చెన్నూరులో గురువారం మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు రెండో దళితవాడకు చెందిన పల్లం రమణయ్య(40) గూడూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతను రెండురోజులుగా తనలోతానే మథనపడుతూ ఆందోళన చెందుతుండడాన్ని కుటుంబసభ్యులు గమనించి అడుగగా ఏమి లేదంటూ దాటవేశాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రమణయ్య ఎంతకు తిరిగి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఇంటికి ఫర్లాంగు దూరంలో ఉన్న బావిలో రమణయ్య మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యులు అనుమానంతో ఇంట్లో రమణయ్యకు సంబంధించిన బ్యాగులను తనిఖీ చేయగా మరణ వాంగ్మూలంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ రాసిన ఉత్తరం, గ్రామసమస్యలపైన మరో ఉత్తరం, ఇతర లేఖలు కన్పించాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని లేఖలో రమణయ్య రాశాడు. ప్రత్యేక హోదా వస్తే అందరం బాగుంటామని పేర్కొన్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ప్రమాదం కాదు.. హత్యే
'సాక్షి' కథనంతో పోలీసుల రంగప్రవేశం ప్రమాదం కేసు హత్యకేసుగా మార్పు నాయుడుపేట టౌన్: ఈనెల 15న ప్రమాదవశాత్తూ మిద్దెపై నుంచి పడి మృతి చెందిన రమణయ్యది ప్రమాదం కాదు హత్యేనని పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో కేవలం రూ. 250 నగదుకోసం విచక్షణారహితంగా సొంత అన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి మృతికి తమ్ముడే కారణమన్న విషయాన్ని పోలీసులు శుక్రవారం వెలుగులోకి తెచ్చారు. ఈ విషయమై సాక్షిలో ప్రచురితమైన కథనం ఆధారంగా పోలీసులు రంగప్రవేశంచేసి తమ్ముడే హత్యచేసినట్లుగా గుర్తించిన సంఘటన సంచలనం కలిగించింది. మిద్దెపై నుంచి పడి చికిత్సలు పొందుతూ మృతిచెందినట్లుగా వాస్తవాలను దాచి మృతుని భార్య ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులను శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయానికి పిలిపించి సీఐ విచారించగా జరిగిన సంఘటనపై నిజాలను వెల్లడించారు. స్థానిక సీఐ రత్తయ్య తెలిపిన వివరాలు మేరకు.. మండల పరిధిలోని వద్దిగుంటకండ్రిగ దళితవాడకు చెందిన సగ్గం రమణయ్య (47) కూలిపనులు చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకొనేవాడు. ఈ క్రమంలో ఈ నెల 15రాత్రి రమణయ్య భార్య వెంకటమ్మతో కలిసి గ్రామసమీపంలో రహదారి పక్కనేవున్న బీడీబంకు వద్దకు వచ్చాడు. అక్కడేవున్న తమ్ముడు సగ్గం పరంధామయ్య సాగునీటిబోరుకు సంబంధించి రూ. 250 బకాయి వుందని చెప్పడంతో ఇద్దరిమద్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువురు రహదారి సమీపంలోనే ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి అరుచుకుంటూ పెట్రోలుబంకు సమీపానికి వచ్చేసరికి రమణయ్యను కోపంతో తమ్ముడు పరంధామయ్య బండరాయి తీసుకొని తలపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన రమణయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి 16న నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడి వైద్యసేవలు అందిస్తుండగా 17న మృత్యువాతపడ్డాడు. అయితే వాస్తవాలు చెప్పకుండా మిద్దెపైనుంచిపడి మృతిచెందినట్లుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రమాదంలో గాయపడి చికిత్సలు పొందుతూ మృతిచెందినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ విషయమై రమణయ్యను దారుణంగా కొట్టి చంపారు అన్న కథనం సాక్షి పత్రికలో వె లువడడంతో దీని ఆధారంగా పోలీసులు రంగప్రవేశంచేసి నిజాలు నిగ్గుతేల్చారు. ఈ మేరకు అన్నను తమ్ముడే దాడిచేసి హత్యచేసినట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వున్న రమణయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..
మర్రిపాడు (నెల్లూరు): కుటుంబ కలహాలు ఓ ఇల్లాలిని బలిగొన్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి గ్రామంలో ఓ వ్యక్తి భార్యను కత్తితో నరికేశాడు. కూలీ పనులు చేసుకునే వెంకటరమణయ్య (28), మల్లి (26) దంపతుల మధ్య విభేదాలు నెలకొనగా.. మంగళవారం తెల్లవారుజామున రమణయ్య కత్తితో నరకడంతో మల్లి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. -
జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్ర విభజనానంతరం కడప జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని జేవీవీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా ఓబుల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు రమణయ్య శుక్రవారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ జిల్లాను ఇంకా సందర్శించలేదన్నారు. ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థ ను ప్రకటించలేదని, రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు. జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం, మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ లాంటి సంస్థలను, అంతర్జాతీయ భాషా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపార ప్రయోజనాలే కాకుండా చారిత్రక నేపథ్యం, భవిష్యత్తు తరాల ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకుని రాజధానిపై శాస్త్రీయమైన, పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కడప-రేణిగుంట, కడప-చిత్తూరు, కడప-బెంగుళూరు రోడ్లను 4 లైన్లుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ పట్టణ కార్యదర్శి రమణ, గోపినాథరెడ్డి, రాజేష్‌రెడ్డి, రచయిత జింకా సుబ్రమణ్యం పాల్గొన్నారు.