దక్కిలి మండలం మార్లగుంట సమీపంలో లారీ బోల్తాపడింది. వైఎస్సార్ జిల్లా చిట్వేల్ నుంచి వెంకటగిరికి ధాన్యం లోడుతో వస్తోన్న లారీకి మార్లగుంట సమీపంలోకి రాగానే గేదె అడ్డువచ్చింది. దానిని తప్పించబోయి లారీ పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య, యుగంధర్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బోల్తా..ఇద్దరి మృతి
Published Mon, Oct 10 2016 8:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement