'కేసీఆర్ గద్దె దిగే వరకూ దళితుల అభివృద్ధి శూన్యం'
లింగాలఘణపురం: సీఎంగా కేసీఆర్ గద్దె దిగేంత వరకూ దళి తుల అభివృద్ధి శూన్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. వరంగల్‌జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని..మాదిగలు, మాలలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని, మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాలపై మే 2న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాలతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత పది రోజులలోపు తెలంగాణ మహిళా శక్తి ప్రదర్శన గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.