వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అనంతపురం జిల్లా శెట్టూరు మండలకేంద్రంలో బుధవారం ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ వర్గం ఆందోళన చేపట్టింది.
వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అనంతపురం జిల్లా శెట్టూరు మండలకేంద్రంలో బుధవారం ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ వర్గం ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ నాయకుడు చలమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
మరో వైపు ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్‌లో కూడా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. దళితుల నాయకులకు పదవుల ఆశచూయించి టీడీపీలోకి చేర్చుకుని దళితజాతినంతా మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి శాలెన్ రాజు, జిల్లా కార్యదర్శి జైరాజ్ ఆరోపించారు.