దొరల తెలంగాణ వద్దు: కృష్ణ మాదిగ | mrps leader manda krishna demads for sc declasification bill | Sakshi
Sakshi News home page

దొరల తెలంగాణ వద్దు: కృష్ణ మాదిగ

Published Sun, Apr 19 2015 4:44 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

దొరల తెలంగాణ వద్దు: కృష్ణ మాదిగ - Sakshi

దొరల తెలంగాణ వద్దు: కృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతి కార్యకర్త పోరాటం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దళిత వ్యక్తినే నియమిస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడని విమర్శించారు. దొరల తెలంగాణ వద్దని సామాజిక తెలంగాణ కావాలని పేర్కొన్నారు.

చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మడంవల్లే గతంలో ఆయన చేపట్టిన పాదయాత్రకు మద్దతిచ్చామని, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. ఈ విషయంపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయకుంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమలు చేపడతామని హెచ్చరించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ నెల 23న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మాదిగల మహగర్జనకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement