మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్
అచ్చంపేట రూరల్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోళ్ల వెంకటేష్‌మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం అచ్చంపేట ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
అచ్చంపేట రూరల్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోళ్ల వెంకటేష్‌మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం అచ్చంపేట ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో గత నెల 19 నుంచి మహాధర్నా జరుగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. ఈనెల 10న ఢిల్లీలో వేలాది మందితో నిర్వహించే మహాధర్నాకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతటి మల్లేష్‌మాదిగ, నాయకులు మంద వెంకటయ్య, సురేష్, లక్షే్మశ్వర్, శ్రీను, రాజు, మహేష్, విజయ్, జగదీష్ పాల్గొన్నారు.