షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై జాప్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి మాదిగల సత్తా తెలిసే రోజు వస్తదని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగ అన్నారు.
శ్రీశైలం: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై జాప్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి మాదిగల సత్తా తెలిసే రోజు వస్తదని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జలవనరుల శాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు ఎస్సీలపై ప్రేమ ఉంటే వర్గీకరణ చేపట్టి అన్ని ఉపకులాలు కోల్పోతున్న నష్టాన్ని పూడ్చాలని ఆయన అన్నారు.
అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలోనైనా ఎస్సీ వర్గీకరణపై బిల్లు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలను చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దానియేల్, కె ప్రసాదరావు,టి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.