
ఏటూరునాగారం : తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ గేస్ట్ హౌజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం సంఘాలన్నీ ఏకం కావాలని మంద కృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణ కోసం నవంబర్లో తలపెట్టిన ఢిల్లీ ముట్టడిని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.