ఏ పార్టీలోకి వెళ్లినా పదవి వస్తుంది..
తాను ఏ పార్టీలో చేరినా మంచి పదవి లభిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
కానీ, దళితుల ప్రయోజనాలే ముఖ్యం: మంద కృష్ణ
సాక్షి, నాగర్‌కర్నూలు: తాను ఏ పార్టీలో చేరినా మంచి పదవి లభిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూలులో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీల్లో చేరాలని చాలామంది అడిగారని, మంచి పదవులు ఇస్తామని చెప్పినా లొంగలేదన్నారు.
ఎమ్మార్పీఎస్ లక్ష్యం నెరవేర నిదే ఏ పార్టీలో చేరకూడదని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. నాగర్ కర్నూలు ఎస్పీ కల్మేశ్వర్ ఇక్కడి దళితులపై రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆరోపించారు.