Dhanush Call Off Divorce with Aishwarya Rajinikanth, Kasthuri Raja Reacts - Sakshi
Sakshi News home page

Dhanush: విడాకులు వద్దనుకుంటున్న ధనుష్‌? స్పందించిన హీరో తండ్రి

Published Tue, Oct 11 2022 6:52 PM | Last Updated on Tue, Oct 11 2022 8:06 PM

Dhanush Calling Off Divorce with Aishwaryaa Rajinikanth, Kasthuri Raja Reacts - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌- ఐశ్వర్య విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే పిల్లల విషయంలో మాత్రం వారు అప్పుడప్పుడు కలుస్తూ వస్తున్నారు. దీంతో వీరు విడాకుల వ్యవహారంలో వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఛాన్స్‌ ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ధనుష్‌, ఐశ్వర్య.. ఇద్దరూ విడాకులను వాయిదా వేసుకోవాలని యోచిస్తున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా స్పందించాడు.

ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ కలుస్తారా? అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ధనుష్‌కు అతడి పిల్లల సంతోషమే ముఖ్యం అని బదులిచ్చాడు. ఇకపోతే ధనుష్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్‌' అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌ 2న విడుదల చేయానుకుంటున్నారు. అలాగే 1930 నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న కెప్టెన్‌ మిల్లర్‌ మూవీ చేస్తున్నాడు.

చదవండి: రోలెక్స్‌ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా
అమితాబ్‌కు చిరు స్పెషల్‌ విషెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement