kasthuri raja
-
నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!
నయనతార సినీ, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (నేనూ రౌడీనే)లోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. తాజాగా ధనుష్ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజాను ‘ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా – ‘‘నయనతార వ్యవహారం గురించి నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. మేం ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంటాం. తరుముకు వచ్చే వారి గురించి కానీ, వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునేంత టైమ్ మాకు లేదు. అయితే ధనుష్ అనుమతి కోసం రెండేళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. మా దృష్టంతా మేం చేసే పని మీద ఉంటుంది. ధనుష్ ‘ఇడ్లీ కడై’ చిత్రంతో బిజీగా ఉన్నారు’’ అన్నారు.– చెన్నై, ‘సాక్షి’ సినిమా ప్రతినిధి -
ధనుష్- ఐశ్వర్య కలుస్తారా? హీరో తండ్రి ఏమన్నాడంటే?
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే పిల్లల విషయంలో మాత్రం వారు అప్పుడప్పుడు కలుస్తూ వస్తున్నారు. దీంతో వీరు విడాకుల వ్యవహారంలో వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ధనుష్, ఐశ్వర్య.. ఇద్దరూ విడాకులను వాయిదా వేసుకోవాలని యోచిస్తున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించాడు. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారా? అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ధనుష్‌కు అతడి పిల్లల సంతోషమే ముఖ్యం అని బదులిచ్చాడు. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయానుకుంటున్నారు. అలాగే 1930 నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ చేస్తున్నాడు. చదవండి: రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా అమితాబ్‌కు చిరు స్పెషల్ విషెస్ -
రజనీకాంత్ వియ్యంకుడికి అరెస్ట్ వారెంట్
చెన్నై: నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజాకు చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెన్నై షావుకారుపేటకు చెందిన ఫైనాన్షియర్ ముకున్చంద్బోద్రా వద్ద దర్శకుడు కస్తూరిరాజా 2012 సంవత్సరంలో రూ. 65లక్షలు రుణం తీసుకున్నారు. అందుకుగాను కస్తూరిరాజా రెండు చెక్కుల్ని ఇచ్చారు. చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవడంతో బాద్రా చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టులో మోసం కేసు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సోమవారం న్యాయమూర్తి కోదండరాజ్ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణకు దర్శకుడు తరపున ఎవ రూ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి దర్శకుడు కస్తూరిరాజాకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల13కు వాయిదా వేశారు.