రజనీకాంత్ వియ్యంకుడికి అరెస్ట్ వారెంట్ | Arrest warrant issued to kasthuri raja | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ వియ్యంకుడికి అరెస్ట్ వారెంట్

Published Tue, Feb 3 2015 9:40 AM | Last Updated on Mon, Aug 20 2018 4:35 PM

రజనీకాంత్ వియ్యంకుడికి అరెస్ట్ వారెంట్ - Sakshi

రజనీకాంత్ వియ్యంకుడికి అరెస్ట్ వారెంట్

చెన్నై: నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజాకు చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెన్నై షావుకారుపేటకు చెందిన ఫైనాన్షియర్ ముకున్‌చంద్‌బోద్రా వద్ద దర్శకుడు కస్తూరిరాజా 2012 సంవత్సరంలో రూ. 65లక్షలు రుణం తీసుకున్నారు. అందుకుగాను కస్తూరిరాజా రెండు చెక్కుల్ని ఇచ్చారు.

చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవడంతో బాద్రా చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టులో మోసం కేసు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సోమవారం న్యాయమూర్తి కోదండరాజ్ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణకు దర్శకుడు తరపున ఎవ రూ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి దర్శకుడు కస్తూరిరాజాకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల13కు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement