Dhanush And His Ex Wife Aishwaryaa Rajinikanth Attend Son Yatra School Event Together, Pics Viral - Sakshi
Sakshi News home page

Aishwaryaa Rajinikanth: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫొటో వైరల్‌

Published Mon, Aug 22 2022 4:45 PM | Last Updated on Mon, Aug 22 2022 6:19 PM

Dhanush Ex Wife Aishwaryaa Rajinikanth Attend Son Yatra School Event Together - Sakshi

కోలీవుడ్‌లో స్టార్‌ జంటగా వెలుగొందిన ధనుష్‌- ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్న ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌ మీడియా ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన దాఖలాలు ఎక్కడా లేవు.  కాకపోతే తన ఇద్దరు కుమారులను వెంటేసుకుని ధనుష్‌ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు. 

ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్‌- ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. 'ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..' అంటూ సోమవారం ఓ ఫొటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇందులో ధనుష్‌, ఐశ్వర్య... తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా, ఏంటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ధనుష్‌ తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఐశ్వర్య రజనీకాంత్‌..  డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతుంది. హిందీలో ఓ సాథీ చల్‌ అనే ప్రేమకథా చిత్రాన్ని ఆమె డైరెక్ట్‌  చేస్తోంది.

చదవండి: ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!
చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement