Aishwaryaa Dropped Dhanush's Name From Her Social Media Handles - Sakshi
Sakshi News home page

Aishwarya Rajinikanth: ధనుష్‌తో కలిసేదేలే అని క్లారిటీ ఇచ్చేసిన ఐశ్వర్య!

Published Thu, Mar 24 2022 2:50 PM | Last Updated on Thu, Mar 24 2022 3:40 PM

Aishwarya Rajinikanth Removed Dhanush Name From Social Media - Sakshi

కోలీవుడ్‌లో స్టార్‌ జంటగా వెలుగొందారు ధనుష్‌- ఐశ్వర్య రజనీకాంత్‌. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అయితే అవి మామూలు గొడవలేనని, మళ్లీ కలిసిపోతారంటూ ధనుష్‌ తండ్రి వ్యాఖ్యానించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. పైగా విడాకుల ప్రకటన తర్వాత కూడా ఐశ్వర్య తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పేరు చివరన ధనుష్‌ అనే పదాన్ని అలాగే ఉంచుకుంది. ఇక ఇటీవల ఆమె డైరెక్ట్‌ చేసిన సాంగ్‌ రిలీజ్‌ చేసిన సమయంలో ఐశ్వర్యను స్నేహితురాలు అని ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు ధనుష్‌. దీంతో వీళ్లు మళ్లీ కలిసే సూచనలున్నాయని అభిప్రాయాపడ్డారు ఫ్యాన్స్‌!

చదవండి: Bheemla Nayak-OTT: ఒక్కరోజు ముందుగానే స్ట్రీమింగ్‌ అవుతున్న ‘భీమ్లా నాయక్‌’

తాజాగా వారి ఆశలపై నీళ్లు చల్లింది ఐశ్వర్య. సోషల్‌ మీడియా ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఐశ్వర్య రజనీకాంత్‌ ధనుష్‌కు బదులుగా ఇప్పుడు ఐశ్వర్య రజనీకాంత్‌ అని మాత్రమే కనిపిస్తోంది. ఈ చర్యతో తాము కలిసేదే లేదని చెప్పకనే చెప్పింది. కాగా ఐశ్యర్య-ధనుష్‌లు ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

చదవండి: గ్యాస్‌ టాంకర్‌ అని వెక్కిరించేవారు.. రాశీ ఖన్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement