విడాకుల తర్వాత తొలిసారి కుమారులతో బయటికొచ్చిన ధనుష్‌ | Dhanush Makes First Appearance With Sons After Separation From Aishwarya | Sakshi
Sakshi News home page

Dhanush: ఐశ్యర్యతో విడాకులు తర్వాత తొలిసారి తనయులతో ధనుష్‌, ఎక్కడికి వెళ్లాడంటే..

Published Sat, Mar 19 2022 1:34 PM | Last Updated on Sat, Mar 19 2022 2:37 PM

Dhanush Makes First Appearance With Sons After Separation From Aishwarya - Sakshi

Dhanush Spot With His Sons After Split With Aishwarya: కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్యర్య రజనీకాంత్‌ విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ధనుష్‌-ఐశ్యర్యలు ఈ ఏడాది ప్రారంభంలో ముగింపు పలకడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2004 నవంబర్‌ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ మాజీ జంటకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

చదవండి: ఫుడ్‌ డెలివరి బాయ్‌గా మారిన స్టార్‌ కమెడియన్‌, ఫొటో వైరల్‌

అయితే వీరు విడాకులు తీసుకుని మూడు నెలలు గడుస్తున్న ఇప్పటికీ వారు ఒక్కటవుతారేమోనని ఆశిస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం వీరిద్దరి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఐశ్యర్య రీసెంట్‌గా ఓ మ్యూజిక్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. దీనిపై ధనుష్‌ ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు మై ఫ్రెండ్‌ అంటూ మాజీ భార్యను స్నేహితురాలు అనేశాడు. దీంతో ఆ ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

చదవండి: మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్‌ ట్వీట్‌, అంత మాట అనేశాడేంటి!

ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ధనుష్‌ తనయులతో కలిసి కనిపించాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కు యాత్రా రాజా, లింగ రాజాలతో కలిసి హజరైన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మార్చి 17న జరిగిన మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్‌ కన్‌సర్ట్‌కు ధనుష్‌ తన ఇద్దరు కుమారులతో పాల్గొన్నాడు. అంతేకాదు ఈ ఈవెంట్‌లో ఇళయరాజా మ్యూజిక్‌కు ధనుష్‌ స్వరాలు కూడా ఇచ్చాడు. ఈ వీడియో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఐశ్యర్య కూడా ఉంటే ఎంత ముచ్చటగా ఉండేదే అంటూ ఈ మాజీ కపుల్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement