After Divorce With Dhanush Aishwarya Rajinikanth Directing Love Song, Deets Inside - Sakshi
Sakshi News home page

Aishwarya Rajinikanth: ధనుష్‌తో విడాకులు.. దానిపైనే ఐశ్వర్య ఫుల్‌ ఫోకస్‌

Published Sat, Jan 22 2022 1:30 PM | Last Updated on Sat, Jan 22 2022 2:00 PM

After Divorce With Dhanush Aishwarya Rajinikanth Directing Love Song, Deets Inside - Sakshi

విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె అప్పుడే తన వృత్తిలో మునిగిపోయింది. ఒక లవ్‌ సాంగ్‌ను ఆమె దగ్గరుండి డైరెక్ట్‌ చేస్తుందట...

మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా వెలుగొందారు ధనుష్‌- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అబద్ధమైతే బాగుండని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారు మళ్లీ కలుస్తారంటూ ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజంగానే వాళ్లు కలుస్తారా? లేదంటే విడాకులు మంజూరవడం తథ్యమా? అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఐశ్వర్య ఏం చేస్తుందో తెలుసా? జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె అప్పుడే తన వృత్తిలో మునిగిపోయింది. ఒక లవ్‌ సాంగ్‌ను ఆమె దగ్గరుండి డైరెక్ట్‌ చేస్తుందట. అందులో భాగంగా నిర్మాత ప్రేన అరోరాకు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నట్లు వినికిడి. ఇది వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ సాంగ్‌ అని, ఇందులో కొంత రొమాన్స్‌ కూడా కలగలిపి ఉంటుందని సమాచారం. ఈ సాంగ్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జనవరి 25 నుంచి 27 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య ఈ సాంగ్‌పైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది.

చదవండి: 'నీ ఎదవ ఓవరాక్టింగ్‌, నీకు కరోనా రావాలి' అంటూ హరితేజపై నెటిజన్‌ కామెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement