సౌత్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రజనీకాంత్ 'లాల్ సలామ్' విడుదలైంది. అయితే, ప్రేక్షకుల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి చిత్ర డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఆప్‌డేట్ ఇచ్చారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొస్తామని ఆమె ఇలా ప్రకటించారు.
'లాల్ సలాం' చిత్రాన్ని తెరకెక్కించడంలో మేము చాలా కష్టపడ్డాం. కానీ, మేము అనుకున్నంతగా విజయం పొందలేకపోయాం. మొదటి మేము అనుకున్నట్లుగా థియేటర్‌లో విడుదల చేయలేదు. కొన్ని సీన్లు లేకుండానే మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ సీన్లు అన్నీ సినిమాకు చాలా ముఖ్యమైనవి. హార్డ్ డిస్క్ కనిపించకపోవడం వల్లే ఈ ఇబ్బందులు పడ్డాం. అయితే, అందులో మిస్ అయిన సీన్లు ఇప్పుడు రికవీరే చేశాం. వాటిని సినిమాకు యాడ్ చేసి సరికొత్తగా ఓటీటీ వర్షన్‌లో విడుదల చేస్తాం. ఇప్పటికే ఆ సీన్లకు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌ను రెహమాన్ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.' అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.
లాల్ సలామ్ చిత్రంలో మొయిదీన్ భాయ్ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్) ఆ రోల్ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందని విడుదలకు రెండురోజుల ముందు అనుకున్నాం. ఈ క్రమంలో ఆయన పాత్రకు సంబంధించి నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్ మారిపోయింది. ఆపై హార్డ్ డిస్క్ కనిపించకుండా పోయింది. దీంతో తప్పని పరిస్థితిలో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్
కథలో బలం ఉన్నప్పటికీ చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయాల వల్లే సినిమాకు మైనస్‌గా మిగిలింది. ఇప్పుడు ఓటీటీ వర్షన్లో అలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న సన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్‌లో లాల్ సలామ్ స్ట్రీమింగ్‌కు రానుందని టాక్. థియేటర్‌లో చూడని వారికి తప్పకుండా నచ్చుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment