సూపర్‌స్టార్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మధ్య థియేటర్లలోకి వచ్చిన 'లాల్ సలామ్'.. ఇప్పుడు అంతే ఫాస్ట్‌గా ఓటీటీలోకి కూడా వచ్చేయబోతుందనే న్యూస్.. మూవీ లవర్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఎంత త్వరగా వస్తే అంతే త్వరగా చూసేయాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రజినీకాంత్ సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఆయన్ని.. తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశాడు. అలాంటి సమయంలో 'జైలర్' సినిమాతో గతేడాది కమ్ బ్యాక్ ఇచ్చాడు. రూ.600 కోట్ల వరకు వసూళ్లు సాధించాడు. ఇంతలా హిట్ సినిమా తర్వాత వస్తున్నాడంటే మినిమమ్ బజ్ అయినా ఉండాలి. కానీ ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చిన 'లాల్ సలామ్' పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైంది. తమిళంలో అంతంత మాత్రంగా ఆడితే తెలుగులో పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
(ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'బిగ్‌బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!)
క్రికెట్ నేపథ్య కథకి తోడు కులం బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో రజినీకాంత్‌ది గెస్ట్ రోల్ కంటే కాస్త గుర్తింపు ఉన్న పాత్ర. ఈయన కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అట్టర్ ప్లాఫ్‌గా నిలిచింది. అయితే ఫలితం ఇలా రావడంతో అనుకున్న సమయాని కంటే ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని ఫిక్సయ్యారట.
రజినీకాంత్ 'లాల్ సలామ్' సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం మార్చి మధ్యలో స్ట్రీమింగ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది మార్చి తొలివారానికి మారినట్లు సమాచారం. అంటే మార్చి 2న ఓటీటీ రిలీజ్ ఉండొచ్చు. ఒకవేళ ఇది కాకపోతే మార్చి 9న గ్యారంటీగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి.
(ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రకుల్ పెళ్లి.. ఈ జోడీ ఆస్తి ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment