OTT: 'ఏజెంట్‌' బాటలో మరో భారీ డిజాస్టర్‌ సినిమా | South India Biggest Disaster Movie Not Streaming In OTT | Sakshi
Sakshi News home page

'ఏజెంట్‌' బాటలో భారీ డిజాస్టర్‌ సినిమా

Published Sat, Mar 23 2024 11:41 AM | Last Updated on Sat, Mar 23 2024 12:58 PM

South India Biggest Disaster Movie Not Streaming In OTT - Sakshi

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్  'లాల్ సలామ్' సినిమాకు ఓటీటీ కష్టాలు ఉన్నట్లు సమాచారం. అఖిల్‌ 'ఏజెంట్‌' సినిమా మాదిరి ఈ చిత్రం కూడా ఓటీటీలోకి ఇక రాదని వార్తలు వస్తున్నాయి. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్​డ్​ టాక్‌ తెచ్చుకోవడంతో థియేటర్‌లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్​ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 9న విడుదలైన 'లాల్‌ సలామ్‌' వచ్చి న‌ల‌భై రోజులు దాటింది. అయినా ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాక‌పోవ‌డంతో పలు అనుమానాలు వస్తున్నాయి. గతంలో డైరెక్టర్‌ ఇశ్వర్య రజనీకాంత్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'లాల్‌​ సలామ్‌ సినిమాకు సంబంధించి 21 రోజులు షూటింగ్ ఫుటేజీ పోయిందని చెప్పింది. అందులో ర‌జ‌నీకాంత్‌, విష్ణువిశాల్‌, విక్రాంత్‌ల‌పై 21 రోజుల పాటు క‌ష్ట‌ప‌డి ఓ క్రికెట్ మ్యాచ్ సీన్ షూట్ చేశాం. 2500 మందితో 10 కెమెరాల‌ సాయంతో ఎంతో ఖర్చుతో వాటిని చిత్రీకరించాం. కానీ, షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ పోయింది. దీంతో రీ షూట్‌ చేసే అవకాశం కూడా లేకుండాపోయింది. సినిమాను అలానే విడుదల చేయడంతో ఆ ఎఫెక్ట్‌ సినిమాపై పడింది.' అని ఆమె తెలిపింది.

ఇప్పుడు ఇదే హార్డ్‌డిస్క్ మిస్సింగ్ ప్రభావం ఓటీటీపై పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ముందుగానే నెట్‌ఫ్లిక్స్‌తో డీల్‌ కుదుర్చుకోవడం.. ఒప్పందం ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌ను సంప్రదించకుండా సినిమా విషయంలో మేకర్స్‌ పలు నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు ఓటీటీ విషయంలో చిక్కులు వచ్చినట్లు సమాచారం. క్రికెట్ సీన్స్ రీ-షూట్ చేయాలనే నిబంధన ముందుగానే నెట్‌ఫ్లిక్స్‌ పెట్టినట్లు టాక్‌ ఉంది. అది ఇప్పుడు అవకాశం లేకపోవడంతో లాల్‌ సలామ​ ఓటీటీ విడుదలకు చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ స్పందించాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement