![Rajinikanth Purchased 12 Acres Land For Poor People - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/4/Rajinikanth-Purchased-12-Acres_0.jpg.webp?itok=pn7nRZMF)
పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో భారీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వాస్తంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన వయసు రిత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వస్తాయిని వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.. రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయన తన రాజకీయ పార్టీని సమాజ్ సేవా సంఘ్‌గా మార్చిన విషయం తెలిసిందే.
కొన్నేళ్లుగు తనను అభిమానించే ప్రజలకోసం తాను ఏమైనా చేయాలని ఆలోచించిన రజనీకాంత్.. పేదల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం తమిళనాడులోని చంగల్‌పట్టు జిల్లా తిరుప్పురూర్‌లో 12 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. కొద్దిరోజుల క్రితమే అక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించి తాను కొనుగోలు చేసిన 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కూడా ఆయన చేయించుకున్నారు. చెన్నై, తిరుప్పురూర్ మధ్య ఉన్న దూరం దాదాపు 45 కి.మీ ఉంది.
అందరికీ అందుబాటులో అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని రజనీ ఉన్నారట. త్వరలో భూమి పూజ కూడా రజనీ ప్రారంభించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ స్థలంపై కచ్చితమైన సమాచారం ఇంకా బయటకు రానప్పటికీ ఆసుపత్రి నిర్మాణం కోసమే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక రజనీకాంత్ సినిమాల టాపిక్‌లోకి వస్తే.. ఇటీవల ఆయన నటించిన 'లాల్ సలామ్' సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఇక కొత్త చిత్రం 'వెట్టయాన్' విషయానికొస్తే, అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో నెలలో షూటింగ్ కూడా పూర్తి కానుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ ఓ చిత్రంలో నటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment