ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీ కూడా ఒకటుంది. ఏంటి నిజమా? అని మీరు అనొచ్చు. కానీ అదే నిజం. 'లాల్ సలామ్' పేరుతో తీసిన ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో వాయిదా వేశారు. ఇప్పుడు థియేటర్లలో తీసుకొస్తున్నా సరే ఒక్కడూ పట్టించుకోవట్లేదు. పేరుకే సూపర్‌స్టార్ గానీ అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?
రజినీకాంత్ అంటే తెలుగులోనూ క్రేజ్ ఉంది. కానీ అదంతా ఒకప్పుడు. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాల వల్ల మన ప్రేక్షకులు ఈయన్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా అలాంటి టైంలోనే.. అంటే గతేడాది 'జైలర్' రిలీజైంది. విడుదలకు ముందు దీనిపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక్క పాట, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ పుణ్యామా అని మూవీ హిట్ అయిపోయింది. రజినీ కమ్ బ్యాక్ అని హడావుడి చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది.
(ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?)
ఇప్పుడు అదే రజినీ నుంచి 'జైలర్' లాంటి హిట్ తర్వాత మరో సినిమా వస్తుంటే అసలు హైప్ అనేదే ఎక్కడా కనిపించట్లేదు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ది గెస్ట్ రోల్ అయినప్పటికీ.. దీన్ని ఈయన మూవీగానే చూస్తారు. కానీ ఎందుకో అది జరగట్లేదు. రజినీ కూతురు ఐశ్వర్య.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా అనేది ఒకటి థియేటర్లలోకి వస్తోందనేది కూడా చాలామందికి ఇప్పటికీ తెలియదు.
తమిళనాడులో ఆడియో లాంచ్ పేరిట ఓ ఈవెంట్ నిర్వహించారు కానీ తెలుగులో కనీస ప్రమోషన్స్ చేయట్లేదు. ఇదంతా చూస్తుంటే రజినీకాంత్.. తెలుగు ప్రేక్షకుల్ని లైట్ తీసుకుంటున్నారా? లేదంటే ఈ సినిమా మీద నమ్మకం లేదా అనే డౌట్ వస్తోంది. అందువల్లనే తెలుగులో కనీస పబ్లిసిటీ చేయట్లేదా అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. రజినీకాంత్ సినిమాకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడం ఏంటా అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?)
Comments
Please login to add a commentAdd a comment