ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ కలవనున్నారా? నిజమేంటంటే? | Dhanush, Aishwarya Rajinikanth To Patch Up After Separation? Here is Answer | Sakshi
Sakshi News home page

Dhanush: విడాకుల ఆలోచన విరమించుకున్న ధనుష్‌, ఐశ్వర్య? మళ్లీ కలుస్తారా?

Published Sat, Oct 14 2023 1:45 PM | Last Updated on Sat, Oct 14 2023 1:57 PM

Dhanush, Aishwarya Rajinikanth To Patch Up After Separation? Here is Answer - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ జంట ధనుష్‌-ఐశ్వర్య రజనీకాంత్‌ గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే! 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకోలేదు కానీ ఇద్దరూ ఏకాభిప్రాయంతో వేర్వేరుగానే జీవిస్తున్నారు. పిల్లల బాధ్యతను మాత్రం ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే వీరిద్దరూ విడాకుల విషయంలో ఓ అడుగు వెనక్కు వేశారని, త్వరలోనే మళ్లీ కలవబోతున్నారంటూ ఈ మధ్య ప్రచారం జరుగుతోంది.

విడాకులు తీసుకోలే..
కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ధనుష్‌, ఐశ్వర్య.. ఇద్దరూ వారివారి పనుల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం వారి ఫోకస్‌ అంతా కెరీర్‌ పైనే ఉంది తప్ప భార్యాభర్తలుగా మళ్లీ కలిసిపోవాలన్న ఆలోచన అయితే ముమ్మాటికీ లేదు. కావున, వీరు మళ్లీ కలిసిపోనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేనట్లు సమాచారం. అయితే వీళ్లు విడిపోయారే కానీ ఇంతవరకు విడాకులకు దరఖాస్తు చేయలేదు. మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడో లేదంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్‌ తీసుకుంటున్నారట.. తర్వాత ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చులే అని ఆలోచిస్తున్నారట!

తిరిగి కలిసే ఛాన్సే లేదా?
భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరికి ఎనలేని గౌరవం ఉంది. పిల్లల కోసం కొన్ని కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనక తప్పడం లేదు. కానీ తిరిగి కలిసిపోయే ఛాన్స్‌ మాత్రం కనిపించడం లేదు! సినిమాల విషయానికి వస్తే.. ధనుష్‌ ప్రస్తుతం కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే తన 50వ సినిమాకు సన్నద్ధమవుతున్నాడు. హాఫ్‌ సెంచరీ కొట్టే సినిమాలో ధనుష్‌ నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య రజనీకాంత్‌ లాల్‌ సలాం సినిమా నిర్మాణ పనులను చూసుకుంటోంది.

చదవండి: అప్పట్లో సల్మాన్‌ పారితోషికం రూ.2.5 కోట్లు.. ఇప్పుడేకంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement