సింగిల్‌గా ఉంటేనే చాలా సేఫ్‌, ఒంటరితనమే బాగుంది: ఐశ్వర్య | Aishwarya Rajinikanth Comments On Single Life, Says Being Alone Is Safe, Deets Inside - Sakshi
Sakshi News home page

Aishwarya Rajinikanth On Single Life: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది!

Published Sun, Feb 11 2024 2:01 PM | Last Updated on Sun, Feb 11 2024 4:33 PM

Aishwarya Rajinikanth: Being Alone Is Safe - Sakshi

విడాకులు.. కొంతకాలంగా ఈ ట్రెండ్‌ కామన్‌ అయిపోయింది. పెళ్లి చేసుకున్న ఏడాదికి, పెళ్లయిన 20 ఏళ్లకు.. ఇలా ఎప్పుడంటే అప్పుడు ఎంతో ఈజీగా బంధాలు తెంచేసుకుంటున్నారు. కలకాలం కలిసి ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినా సరే దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో స్టార్‌ జంటగా వెలుగొందిన ధనుష్‌- ఐశ్వర్య రజనీకాంత్‌ రెండేళ్లక్రితం విడిపోయారు.

సినిమాలపై ఫోకస్‌
విడాకులు తీసుకోలేదు కానీ ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ధనుష్‌ తన సినిమాల మీద ఫోకస్‌ చేయగా ఐశ్వర్య కూడా దర్శకత్వంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తను డైరెక్ట్‌ చేసిన లాల్‌ సలాం మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె తండ్రి రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది.

ఒంటరితనమే బాగుంది
'గత రెండేళ్లుగా ఒంటరితనంతోనే సావాసం చేస్తున్నాను. అయితే ఈ ఒంటరితనాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. నేను గ్రహించిన ఓ ముఖ్య విషయం ఏంటంటే.. ఒంటరిగా ఉన్నప్పుడే మరింత సురక్షితంగా ఉండగలం. ఈ ఏకాంతం నాకు చాలా బాగా నచ్చింది. వాయ్‌ రాజా వాయ్‌ (2015) సినిమా తర్వాత పిల్లల కోసం సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాను. కానీ ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్లిపోతోంది. టైమే తెలియడం లేదు. పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలనుకున్నాను.

అదే  ఈజీ..
అందుకే అప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నాను. ఇక చెప్పాలంటే జీవితాన్ని  ఒంటరిగా లాక్కురావడమే ఈజీగా ఉంది' అని చెప్పుకొచ్చింది. దీంతో వీరు ఎప్పటికైనా కలుస్తారని అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. కాగా ఐశ్వర్య- ధనుష్‌ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి లింగ, యాత్ర అని ఇద్దరు కుమారులు జన్మించారు. దాదాపు 18 ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఐశ్వర్య- ధనుష్‌ 2022లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.

చదవండి: బికినీలోనే కాదు అవసరమైతే అంటూ.. బోల్డ్‌ కామెంట్‌ చేసిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement