నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లకు చైన్నె హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఉన్న కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ధనుష్ కథానాయకుడిగా ఐశ్వర్య రజనీకాంత్ నిర్మించిన చిత్రం 'వేలైయిల్లా పట్టాదారి' తెలుగులో రఘువరణ్ బీటెక్. ఈ చిత్రం 2014 జూలై నెలలో విడుదలైంది. కాగా ఇందులో ధనుష్ సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ సందర్భాల్లో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం వంటి చట్టపరమైన నిబంధనల పాటించలేదంటూ టుబాకో నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
(ఇదీ చదవండి: చిరంజీవి గొప్ప మనసు.. ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం)
దీంతో ఆరోగ్య శాఖ సహాయక నిర్వాహకుడు చైన్నె, సైదాపేట కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్‌లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో తమ వ్యక్తిగతంగా హాజరుకాకుండా ఆదేశాలు జారీ చేయాలని, తమపై కేసును కొట్టివేయాలని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడివిడిగా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్ తీర్పును న్యాయవాది విజయ్ సుబ్రమణియన్ హాజరై వాదించారు. వాదనల అనంతరం ఈ కేసులో సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు నాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment