లాల్ సలామ్.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈ మూవీలో రజనీకాంత్‌ది అతిథి పాత్ర మాత్రమే! విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే కూతురే డైరెక్టర్ కావడంతో రజనీ గెస్ట్‌గా నటించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఏం బాగుంటుందని తన పాత్రను బలవంతంగా పొడిగించారట. దానివల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందంటోంది ఐశ్వర్య రజనీకాంత్.
రజనీ ఇమేజ్‌కు తగ్గట్లుగా..
తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'లాల్ సలామ్ చిత్రంలో మొయిదీన్ భాయ్ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్) ఆ రోల్ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందనుకున్నాం.. నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్ మారిపోయింది. మొయిదీన్ భాయ్ చుట్టూ సినిమా తిరిగేలా ప్లాన్ చేశాం. నిజానికి అతడు ఇంటర్వెల్ వస్తాడు. కొన్ని కారణాల వల్ల తనను సినిమా ప్రారంభంలోనే పరిచయం చేశాం. లేదంటే ప్రేక్షకులు ఇంటర్వెల్ వరకు ఓపిక పట్టలేరేమోనని భయపడ్డాం.. అందుకే సినిమా అంతటా ఆయన ఉండేలా రకరకాలుగా ఎడిట్ చేయాల్సి వచ్చింది.
ఆయన్ను చూశాక సినిమా పట్టించుకోలేదు
సినిమాలో కంటెంట్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రజనీకాంత్‌ను చూపించామో అంతా నీరుగారిపోయింది. ఆయన్ను చూశాక మిగతా కథ గురించి, పాత్రల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అంటే రజనీకాంత్ సినిమా అంటే పూర్తిగా ఆయన గురించి మాత్రమే ఉండాలి. అది కాకుండా వేరే వాటిపై ఫోకస్ చేస్తే జనాలు ఒప్పుకోరని నాకు ఈ సినిమాతో తెలిసొచ్చింది. ఆయన ఉంటే మిగతావాటిపై ఎవరూ ఫోకస్ చేయలేరు. అంతగా డామినేట్ చేస్తాడు' అని చెప్పుకొచ్చింది.
చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్..
Comments
Please login to add a commentAdd a comment