కోలీవడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాగి తమ వైవాహిక బంధాన్ని స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. జనవరిలో తాము విడిపోయామని ప్రకటించిన ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ మాజీ జంట వారి వారి పనుల్లో బిజీగా అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అంనతరం ఐశ్వర్య తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.
చదవండి: రవితేజకు షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్!
ఈ క్రమంలో ఆమె ఓ సంచలన ట్వీట్ చేసింది. జిమ్‌లో వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘బయటి నుంచి ఎలాంటి ప్రతికూలత వచ్చినా దానిని సమర్థవంతగా ప్రతిఘటించగలను. అందుకు ప్రేరణ నాలోనే ఉంది. ఇక నెగిటివిటి లేకుండ జీవించగలను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్ ఇది ధనుష్ ఉద్ధేశించే చేసిందేనా? అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రజినీకాంత్ ఓ బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
My Monday morning 👊🏼
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) July 25, 2022
Motivation for anything for me comes from within..
Any kind of negativity from outside ..I can live without #workingonself #onlypositivevibes pic.twitter.com/WlTpO2zSWM
Comments
Please login to add a commentAdd a comment