![Aishwaryaa Rajinikanth Files Complaint After 60 Sovereigns Gold, Diamonds Stolen - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/20/aishwarya-rajinikanth.jpg.webp?itok=TAlxFhUD)
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, ధనుష్ మాజీ భార్య ఐశ్యర్య రజనీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇంట్లో చోరి జరిగిందని, లక్షలు విలువ చేసే నగలు, వజ్రాలు దొంగతనానికి గురైనట్లు చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు లాకర్‌లో ఉన్న నగదు పోవడంతో ఐశ్వర్య తన ఇంట్లో పని చేసే ముగ్గురు సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ తేనాం పేట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్
చోరికి గురైన వాటిలో డైమండ్ సెట్, ఆలయ అభరణాలలో అన్‌కట్ డైమండ్స్, పురాతన బంగారు ముక్కలు, నవరత్నం సెట్లు, బంగారు, వజ్రాలతో కూడిన రెండు నెక్ పీసెస్‌కి సరిపడే చెవిపోగులు, ఆరమ్ నెక్లెస్, సుమారు 60 సవర్ల బ్యాంగిల్స్ ఉన్నాయని పేర్కొంది. వీటి విలువ సుమారు 3.6లక్షల ఉంటుందని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. కానీ వాస్తవంగా వాటి విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా 2019లో జరిగిన తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు.
చదవండి: ఆ హీరోయిన్‌ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్‌తో నటి ఆరోపణలు..
ఆ తర్వాత నుంచి వాటిని బయటకు తీయలేదని ఫిర్యాదు పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని తన తండ్రి రజనీకాంత్ పోయేస్ గార్డెన్ నివాసంలోని లాకర్‌లో ఈ నగదు భద్రపరిచనట్లు ఆమె చెప్పారు. అయితే లాకర్ కీ మాత్రం తన దగ్గరే ఉందని, ప్రస్తుతం తాను నివసిస్తున్న సెయింట్ మేరిస్ రోడ్ అపార్టుమెంటులోని పర్సనల్ స్టీల్ అల్మారాలో లాకర్ కీ ఉంచినట్లు ఐశ్వర్య తెలిపారు. దీని సమాచారం తన పనివాళ్లకే తెలుసని, వారే నగదు దొంగతనం చేసుంటారని ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment