తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గత కొద్ది రోజులుగా విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రితమే హీరో ధనుష్‌తో విడిపోయిన ఆమె అప్పటినుంచి వేరుగా జీవిస్తోంది. మళ్లీ కలుస్తారని మధ్యలో ఊహాగానాలు వెలువడినా చివరకు విడాకులు తీసుకోవడానికే ఇద్దరూ మొగ్గు చూపారు. ఇందుకోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
పిల్లలతో ఇదే ఇంట్లో
ఇదిలా ఉంటే ఐశ్వర్య కొత్తిల్లు కొన్నదంటూ గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నైలోని ఈ కొత్తింట్లోనే ఐశ్వర్య తన కుమారులిద్దరితో కలిసుండనుంది. ఇటీవలే గృహ ప్రవేశం జరగ్గా ఈ వేడుకకు తల్లిదండ్రులు లత-రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం పెద్ద హడావుడి లేకుండా ఎంతో సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది.
డిజాస్టర్
కాగా ఐశ్వర్య.. ధనుష్‌ను హీరోగా పెట్టి '3' సినిమా తీసింది. తర్వాత 'వాయ్ రాజా వాయ్' మూవీకి దర్శకుడరాలిగా వ్యవహరించింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 'లాల్ సలాం'తో మరోసారి దర్శకురాలి అవతారం ఎత్తింది. తన తండ్రి రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
చదవండి: నటుడి ఇంట మోగిన పెళ్లి బాజాలు.. వరుడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment