ఫిబ్రవరిలో లాల్‌ సలామ్‌లోకి... | Rajinikanth comeback directorial Lal Salaam shoot will begin | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో లాల్‌ సలామ్‌లోకి...

Dec 22 2022 4:54 AM | Updated on Dec 22 2022 7:51 AM

Rajinikanth comeback directorial Lal Salaam shoot will begin - Sakshi

‘లాల్‌ సలామ్‌’ గ్రౌండ్‌లోకి రజనీకాంత్‌ ఎంట్రీ ఫిబ్రవరిలో అని సమాచారం. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌సలామ్‌’. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ మధ్య ఓ పది రోజులు షూటింగ్‌ చేశారు. అయితే రజనీ లేని సీన్స్‌ని చిత్రీకరించారు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌లోకి రజనీ అడుగుపెడతారట. ఇక ‘3’ (2012) చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య ఆ తర్వాత ‘వై రాజా వై’ (2015), ‘రాజా రాణి’ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్‌ సలామ్‌’. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement