
నటుడు రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో రూ.60 లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయి. ఐశ్వర్య స్థానిక తేనాంపేట లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.60 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురైయ్యాయని తెలిపారు. అవి తన పెళ్లి నగలని తెలిపారు. వాటిని తాను ఇంట్లోని లాకర్లో పెట్టానని, ఫిబ్రవరి 10వ తేదీన లాకరు తెరిచి చూడగా ఎక్కువ భాగం నగలు కనిపించలేదని చెప్పారు.
తన ఇంట్లో పని చేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఐశ్వర్య ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయంలో స్పష్టత లేదు. గత నెల 10వ తేదీన నగలు చోరీకి గురయ్యాయని చెప్పిన ఐశ్వర్య ఆ విషయం ఇప్పుడు వెలుగుచూడడంలో మర్మమేమిటి అన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment