Dhanush, Aishwarya Met In Common Friend Party After Separation In Chennai - Sakshi
Sakshi News home page

Dhanush-Aishwary Rajinikanth Divorce: ఒకే పార్టీలో ఐశ్వర్య-ధనుష్‌, ఏం జరిగిందంటే

Published Wed, Mar 2 2022 8:34 AM | Last Updated on Wed, Mar 2 2022 12:35 PM

Dhanush, Aishwarya Met In Common Friend Party After Separation In Chennai - Sakshi

మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా వెలుగొందారు ధనుష్‌- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్‌-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో ధనుష్‌ తండ్రి  కస్తూరి రాజా ఓ మీడియా సమావేశంతో వాళ్లిద్దరు మళ్లీ కలుస్తారంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్‌, వారి ఫాలోవర్స్‌ అంతా త్వరలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగి ఒక్కటవుతారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన తాజాగా చోటు చేసుకుంది.

చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే..

ఇటీవల షూటింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ధనుష్‌-ఐశ్వర్యలు ఒకే హోటల్‌లో ఉ‍న్నప్పటికీ కనీసం ఒకరినిఒకరు చూసుకొనే లేదట. ఇక తిరిగి చెన్నై వెళ్లిన(వేరు వేరుగా) ఇద్దరు ఓ కామన్‌ ఫ్రెండ్‌ పార్టీకి హజరైనట్లు తెలుస్తోంది. పార్టీలో ఈ మాజీ దంపతులు మాట్లాడుకుంటారేమోనని అక్కడికి వచ్చిన అతిథులంతా ఆసక్తిగా ఎదురు చూశారట. కానీ వారు మాత్రం దూరంగానే ఉన్నారట. అంతేకాదు ఒకరికి ఒకరు తెలియనట్లుగా వ్యవహరించినట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం.  కనీసం మాటవరుసకైనా ఒకరినొకరు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది.

చదవండి: హీరోగా ‘మైనింగ్‌ కింగ్‌’ గాలి జనార్థన్‌ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్‌ ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement