వాట్సాప్‌ కొత్త ఫీచర్‌..! ‘మెసేజ్‌ వస్తే...మీ ఫోటో కన్పిస్తుంది..!’ | Whatsapp That Displays Your Profile Picture In The Notification Window | Sakshi
Sakshi News home page

WhatsApp: వాట్సాప్‌ కొత్త ఫీచర్‌..! ‘మెసేజ్‌ వస్తే...మీ ఫోటో కన్పిస్తుంది..!’

Published Wed, Jan 5 2022 9:17 PM | Last Updated on Wed, Jan 5 2022 9:23 PM

Whatsapp That Displays Your Profile Picture In The Notification Window - Sakshi

వాట్సాప్‌ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌.  సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్‌ సొంతం. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సాప్‌’ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్స్‌తో ముందుకురానుంది.తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌తో వాట్సాప్‌ రానుంది.

మెసేజ్‌ వస్తే..కన్పిస్తారు..!
సాధారణంగా యూజర్లు ఇతరులకు మెసేజ్‌ చేయగానే ఆయా రెసిపెంట్స్‌కు నోటిఫికేషన్‌  బార్‌లో ‘ యూ హవ్‌ ఏ న్యూ మెసేజ్‌’ అంటూ మెసేజ్‌ వస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌ తెస్తోన్న కొత్త ఫీచర్‌తో ఇకపై ఇతరులు మెసేజ్‌ చేయగానే ఆయా వ్యక్తుల ప్రొఫైల్‌ ఫోటో నోటిఫికేషన్‌ బార్‌లో కన్పించనుంది. ఈ ఫీచర్‌ తొలుత ఐవోఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

నోటిఫికేషన్‌ ఫోటో ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తోన్నట్లు వాట్సాప్‌ ట్రాకర్‌ WABetaInfo పేర్కొంది. అన్నీ పరీక్షలు పూర్తైన తరువాత ఐవోఎస్‌ యూజర్లతో పాటుగా, ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది.   

చదవండి: వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్..! ‘సారీ..మీరు ఎవరు..!’ అంటూ అమాయకంగా మెసేజ్..! తరువాత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement