మీరు అట్రాక్టివ్ పర్సనా.. కాదా..?
ట్విట్టర్ ఖాతా ఉందా.. అయితే తాజా సర్వేలో వీరిపై కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ సైకలాజికల్ సర్వే నిర్వహించింది. ఇందుకు సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ను మాధ్యమంగా చేసుకుని సర్వే చేసింది. దాదాపు 66 వేల మంది ఖాతాదారుల ట్విట్టర్ ప్రొఫైల్ ను పరిశీలించింది. ప్రొఫైల్ ద్వారా మనం ఎంత అట్రాక్టివ్ వ్యక్తులం, వారి హావభావాలు ఎలా ఉంటాయన్నది సర్వేలో వెల్లడైంది.
వ్యక్తులు మొత్తం ఐదు గ్రూపులని విభజించారు ప్రొఫైల్ పిక్చర్ తమ ఫొటో, పెంపుడు జంతువులు, మరేదైనా ఫొటోలు అప్ లోడ్ చేసినవారు.. ఇలా అన్ని రకాల వ్యక్తుల ఖాతాలపై సర్వే జరిగింది. ఫ్రొఫైల్ డాటా గమనిస్తే.. కేవలం ఫాలోయర్స్, ట్వీట్స్, రీట్వీట్స్ మాత్రమే కాదు ఆ వ్యక్తి స్వభావం ఏంటన్నది తెలుస్తుందట. ముఖ్యంగా న్యూరోటిసిమ్ కలిగిన వ్యక్తులు టెన్షన్ గా ఉంటారని, అగ్రిబుల్ నెస్ ఉన్న వారు చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోష పెట్టడం అలవాటని కనుగొన్నారు. కలర్ ఫుల్ ఫొటోలు పెట్టే తరహా వారు గట్టిగా నవ్వేస్తుంటారని, నవ్వడం వారికి సహజగుణమని చెప్పారు.
కాన్సెన్షియస్ తరహా వ్యక్తులు చాలా క్రమశిక్షణతో మెలుగుతారని, పాత జ్ఞాపకాలు, పాత మిత్రులను కలుసుకోవడం వారితో కాలక్షేపం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారట. మరికొందరు వ్యక్తులు ఏ విషయాన్నయినా సూటిగా, స్పష్టంగా చెప్పేస్తుంటారు. కోపం వచ్చినా, సంతోషం కలిగినా కారణాలను వెల్లడిస్తారని రీసెర్చర్స్ పేర్కొన్నారు. రోజుకు 8 ట్వీట్లు చేసినట్లయితే ఆ యూజర్ ఎలాంటి తరహా వ్యక్తి, వారు ఎక్కడ ఉంటారు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చని ఇటీవల సర్వేలో తేలిన విషయం తెలిసిందే.