personality
-
అందం అంటే..?
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట! భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి. భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు. చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే. భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు. నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు. – డా.ఎన్.అనంతలక్ష్మి -
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనే తపన ..!
మాయ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రఖ్యాత ఎమ్మెన్సీలో పనిచేస్తోంది. ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె చలాకీతనం చూసి రవి ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేశాడు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉంది. ఇద్దరూ కలసి పార్టీలు, పబ్‌లంటూ తిరిగేవారు. పండంటి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత మాయ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. బిడ్డను కూడా పట్టించుకోకుండా జిమ్, యోగా అంటూ తిరుగుతోంది. అందంగా కనిపించాలని, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని ఎక్స్పోజింగ్ డ్రెస్లేస్తోంది. కారణం లేకుండానే ఏడుస్తోంది, అరుస్తోంది, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తోంది. ఆవేశంలో ఆమె ఏమైనా చేసుకుంటే అది తన మెడకు చుట్టుకుంటుందని రవి హడలి పోతున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుల సలహా మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్‌కి వెళ్లారు. ఒక వ్యక్తి సమస్యను అర్థం చేసుకోవాలంటే వారి కుటుంబ, సాంస్కృతిక నేపథ్యం అవసరం. మాయ లేకలేక పుట్టిన పిల్ల. దాంతో ఆమె బాల్యం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆటలు, పాటలు, నాట్యంలో ముందుండేది. ఆమె ఏం చేసినా పేరెంట్స్ కాదనేవారు కాదు. తప్పు చేసినా సంబరంగా చప్పట్లు కొట్టేవారు. దాంతో ఇతరులు మెచ్చుకుంటేనే, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటేనే సెల్ఫ్ వాల్యూ ఉంటుందనే భావన ఆమెలో ఏర్పడింది. మాయతో ఓ గంట మాట్లాడాక ఆమె హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్(ఏ్కఈ)తో బాధపడుతున్నట్లు అర్థమయింది. సైకోడయాగ్నసిస్లోనూ అదే నిర్ధారణైంది. దీనికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ), సైకోడైనమిక్ టెక్నిక్స్ల కలయికగా చికిత్స ఉంటుంది. ఇది మాయ తన సెల్ఫ్ ఇమేజ్ను పెంచుకోవడంలో ఇవి సహాయపడతాయి. ప్రతికూల ఆలోచనా విధానాలను గుర్తించి, సవాలు చేస్తుంది. ఒత్తిడిని జయించడానికి ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ దంపతులు అంగీకారం మేరకు వారానికో సెషన్ షెడ్యూల్ అయింది. ఆరు నెలల్లో మాయ ప్రవర్తనలో ఆశించిన మార్పులు కనిపించాయి. అసలిదేమిటి? వ్యక్తిత్వ లోపాలుగా కనిపించే మానసిక రుగ్మతలను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇవి దాదాపు తొమ్మిదిశాతం మందిలో ఉంటాయి. ఒక శాతం ప్రజల్లో హెచ్పీడీ కనిపిస్తుంది. ఇందులో వ్యక్తి ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు నాటకీయంగా భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. ఇతరులను మానిప్యులేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇది యుక్తవయస్సులో మొదలవుతుంది. ఎలాగైనా ఆకట్టుకోవాల్సిందే.. నిరంతరం ఇతరుల భరోసా లేదా ఆమోదం అవసరం కావడం ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రవర్తనల్లో మునిగిపోవడం ·అందుకోసం మితిమీరిన భావోద్వేగాలను ప్రదర్శించడం బలహీనత, అనారోగ్య లక్షణాలను ప్రదర్శించడం రూపంపై అతిగా శ్రద్ధ చూపడం, ఎక్స్‌పోజింగ్‌గా ఉండే దుస్తులు ధరించడం లైంగికంగా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఆత్మహత్య బెదిరింపులతో ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడటం అస్థిరమైన మనోభావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు ఎవరూ పట్టించుకోకపోతే నిరాశకు గురవడంమందుల్లేవు, థెరపీనే మార్గం..వ్యక్తిత్వ లోపాలను ఎవరూ గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. దీన్ని తగ్గించే మందులూ లేవు. ముందుగా రుగ్మతను గుర్తించడం, దానికి సైకోథెరపీ ద్వారా చికిత్స తీసుకోవడం అవసరం. దానికి ముందుగా జీవనశైలిలో మార్పుద్వారా.. కొంతవరకు సంస్కరించుకోవచ్చు. అతి గారాబమూ కారణమే..కొన్ని కుటుంబాలలో హెచ్పీడీ కొనసాగుతుంది. అందుకే దీనికి జన్యుపరమైన సంబంధం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బాల్యంలో కుటుంబ సభ్యుడి మరణం, లేదా హింసకు గురికావడం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యక్తిత్వ లోపంలో భాగంగా మారవచ్చు. హద్దులు లేని, అతిగా ఆనందించే పేరెంటింగ్ స్టైల్లో పెరిగిన పిల్లల్లో ఈ డిజార్డర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నాటకీయ, అస్థిర, అనుచిత లైంగిక ప్రవర్తనను ప్రదర్శించే తల్లిదండ్రులు కూడా కారణం కావచ్చు. ఎలాగంటే..రోజూ వ్యాయామం చేయడం తిండి, నిద్ర షెడ్యూల్స్ చేసుకోవడం ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి మానుకోవడం మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచడానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయాన్ని పొందడం సైకోథెరపీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది హెచ్పీడీకి ప్రత్యేకించి మందులు లేకపోయినా, దానివల్ల వచ్చే ఆందోళన, నిరాశలను తగ్గించేందుకు మందులు ఉపయోగ పడతాయి యోగా, బయో ఫీడ్‌బ్యాక్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు వ్యక్తిత్వ లోపాలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా సహాయ పడవచ్చు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వీలైనంత త్వరగా వ్యక్తిత్వ రుగ్మతల నుంచి బయటపడవచ్చు.సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!) -
బంగారం లోంచి సువాసనలు..!
కొంతమంది యోగ్యత కలిగినవారు ఉన్నత పదవులలోకి వెళ్ళిన కారణం చేత ఆ పదవి శోభిస్తుంది. వాళ్ళకీ కీర్తి వస్తుంది. పదవి, వ్యక్తి గుణాలు రెండూ సమున్నతంగా ఉంటే... బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. ఎలా అంటే... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేసిన హెర్బర్ట్ హూవర్ బాగా పేదరికం అనుభవించాడు. తల్లీతండ్రీ లేరు. మేనమామ చదివిస్తున్నాడు. 18వ ఏట స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా..కళాశాల ఫీజు కట్టేంత డబ్బుసమకూరక చిక్కుల్లోపడ్డాడు. దీనినుంచి బయటపడడానికి ... స్నేహితుడితో కలిసి ఒక ఆలోచన చేసాడు. అప్పట్లో పోలండ్‌లో పియానో విద్వాంసుడిగా ఖ్యాతి వహించిన ఈగ్నాసీ యాన్ పద్రెస్కీ కచేరీ పెట్టి వచ్చిన వసూళ్ళలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఫీజుల కింద చెల్లించాలనుకున్నారు. ఆయనను సంప్రదించి రెండువేల డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వసూళ్లు కేవలం 1600 డాలర్లే వచ్చాయి. పైగా కచేరీ నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలి. ఏం చేయాలో తోచక నేరుగా పద్రెస్కీనే కలిసి వచ్చిన మొత్తం డబ్బు ఆయన చేతిలో పెట్టి మిగిలిన దానికి చెక్ ఇచ్చారు... మీరు కాలేజీ ఫీజులకోసం ఇది చేస్తున్నామని ముందుగా ఎందుకు చెప్పలేదంటూ పద్రెస్కీ ఆ చెక్ చించేసి డబ్బు తిరిగి వారి చేతులో పెట్టి... మీ ఫీజు, కచేరీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలితే ఇవ్వండి, లేకపోయినా ఫరవాలేదన్నారు. పద్రెస్కీ తదనంతర కాలంలో పోలండ్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. పోలండ్‌లో కరువు పరిస్థితి. తినడానికి కొన్ని లక్షలమందికి అన్నంలేని స్థితి. ప్రధానమంత్రిగా ఆయన అమెరికాలోఉన్న అంతర్జాతీయ ఆహార, సహాయ సంస్థకు ఒక విజ్ఞాపన పంపారు. ఆ సంస్థకు అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్. ఆ ఉత్తరాన్ని పరిశీలించి టన్నులకొద్దీ బట్టలు, ప్రతిరోజూ 2 లక్షలమందికి భోజనానికి సరిపడా సామాగ్రి పంపారు. ఈ ఉపకారానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పద్రెస్కీ అమెరికా వెళ్ళి హోవర్‌ను కలిసాడు. ‘‘మీరు కాదు కృతజ్ఞత లు.. నేను చెప్పాలి’’ అన్నాడు హోవర్. అదేమిటి అని పద్రెస్కీ ఆశ్చర్యపోతుండగా... గతంలో ఫీజుకట్టలేక మీ కచేరీ పెట్టి మిమ్మల్ని ఇద్దరు విద్యార్థులు కలిసారు, గుర్తుందా... అని అడిగాడు హోవర్. ఎప్పుడో జరిగిన వృత్తాంతం. అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచాయి. మీరు తీసుకోకుండా ఇచ్చిన డబ్బుతో కాలేజి ఫీజు చెల్లించి చదువు పూర్తి చేసుకోవడానికి మీరు సహకరించింది నాకే. మీరు చేసిన సాయంతోనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను... అన్నాడు. ఆ తరువాత కాలంలో...అంటే అమెరికా అధ్యక్షపదవి స్వీకరించడానికి ముందు కూడా హోవర్ పోలండ్ వెళ్లాడు. మళ్ళీ అక్కడ పేద పిల్లల స్థితిగతులను చూసి చలించిపోయి భారీ ఎత్తున సహాయం పంపే ఏర్పాట్లు చేసాడు... మంచి గుణగణాలు.. వారికే కాదు, వారి పదవులకు కూడా గౌరవం తెచ్చిపెడతాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
-
మంచి మాట: ఉత్తమ వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంటుంది?
కొంతమంది దృష్టిలో వ్యక్తిత్వమంటే... ప్రవర్తన, దార్శనికత, ఉద్వేగ భరితం, చక్కని ఆలోచనా విధానం, సంభాషించే పద్దతి, కుటుంబంతో, ఇతరులతో మసలుకునే విధానం.. విశ్వాసాలు. మరికొంతమందికది సాహసం.. నియమబద్ధత.. ఖచ్చితత్వం.. క్రమశిక్షణ.. సృజనశీలత. ఇలా ఒక వ్యక్తిలోని అనేక గుణాల సమాహారమే వ్యక్తిత్వమంటే. ఈ లక్షణాలలో ఏ ఒక్కటైనా అభిలషణీయమైన నిష్పత్తిలోకాక హెచ్చు స్థాయి లో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిత్వం ఒక విశిష్ఠతను సంతరించు కుంటుంది. అది మంచిగా.. లేదా చెడుగా పరిణమించవచ్చు. ఇక్కడ అప్రమత్తత కావాలి. ఒక మహాభవనం నిర్మించాలంటే దానికి పటిష్టమైన పునాది అవసరం. ఇటుక మీద ఇటుక పెడుతూ సిమెంట్ పూస్తూ తాపీతో చదును చేసి.. గోడలు కట్టి.. ఆకర్షణీయమైన.. ఆహ్లాదకరమైన రంగులు వేసి ఇతర సర్వ హంగులు సమకూర్చిన తరువాత కాని తయారు కాదు ఏ మహా భవంతి అయినా. ఉన్నత వ్యక్తిత్వ సౌధానికి అంతే. తపన.. కోరిక.. పట్టుదలనే ఇటుకలకు సంకల్పం, ధృతి అనే సిమెంట్‌ను జోడించి నిర్మించాలి. ఇంత దృఢమైన, సుందరమైన భవన స్థాపన అనేక సంవత్సరాల కృషి.. తపన. కోరిక ..పట్టుదల వల్ల మాత్రమే సాకారమవుతుంది. దీనిని ఒకసారి నిర్మించి వదిలేస్తే సరిపోదు. నిరంతర పరిశీలన కావాలి. దీనిలోని లోపాలను గమనించి అవసరమైతే పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే ఒక గొప్ప వ్యక్తిత్వ సౌధం ఏర్పడి మరింతగా శక్తిమంతమైనదిగా రూపొందుతుంది. అలా తమ జీవితకాలమంతా ఎవరైతే తపిస్తారో ఆ వ్యక్తిత్వం ఒక పారిజాత పుష్పమవుతుంది. ఎన్నటికీ ఇగిరిపోని గంధ మవుతుంది. దాని ప్రభావం ఆ తరం వారి మీదే కాక, అనేక తరాలవారి మీద ఉంటుంది. శాశ్వత ముద్ర వేస్తుంది. వారే చిరంజీవులవుతారు. ఏకాగ్రత సాధనకు ఏకలవ్యుడు.. జ్ఞానాన్వేషణలో గురువునే ప్రశ్నించిన నరేంద్రుడు.. ఆకలితో మలమల మాడుతూ శలభాల్లా పడిపోతున్న గోదావరి వాసులకు పాశ్చాత్యుడైనా అపర భగీరధుడై గోదావరీ జలాలను పారించి వారికి అన్నపూర్ణనే ఇచ్చిన సర్ అర్థర్ కాటన్ మానవత్వం, ఆకలితో అలమటించే వారికి డొక్కా సీతమ్మ నిరతాన్నదానం .. ఇలా ఎందరివో ఉత్తమ వ్యక్తిత్వాలు. ఈ వ్యక్తిత్వ రూపకల్పన ఎలా జరుగుతుంది, దీనికి ప్రేరణ ఎలా వస్తుంది, దీని దిశ –దశ లు ఏమిటి.. అన్న జిజ్ఞాస మనలో కలగాలి. అన్వేషణ చేయాలి. దీనికి మంచి పుస్తకాలు చదవాలి. సారాన్ని గ్రహించాలి. దానిని మదిలో నిలుపుకోవాలి. మన జీవితానికి ఎంత వరకు.. ఎలా అన్వయించుకోవాలో తెలియగల వివేచన కావాలి. ఒక సాధారణ కరమ్ చంద్ గాంధీ అనే గుజరాతీయుడు జాన్ రస్కిన్.. టాల్‌స్టాయ్.. హెన్రీ డేవిడ్ థోరో ల రచనల ఆలంబనగా తన జీవితాన్ని.. దాని పథాన్ని మార్చుకుని ఎంతటి ఉన్నత దశకు చేరుకున్నాడో మన కందరకు తెలుసు. ఆయన మీద భగవద్గీత ఎంత ప్రభావాన్ని చూపిందో... బైబిల్ కూడ అంతే. వాటిని చక్కని వ్యక్తిత్వ సాధనకు గొప్పగా ఉపయోగించుకున్నాడు. అంతేకాదు. ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపిన.. చూపగలిగే వ్యక్తులలో నాటి నుండి నేటి వరకు ఉన్నారు. పుస్తక పఠనం చక్కని వ్యక్తిత్వానికి ఎలా దారితీస్తుందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలదు. ఈ రకమైన ప్రభావం పరోక్షంగా ఉంటుంది. దీనికన్నా సులువైన, గొప్పదైన మార్గమూ ఉంది. అదే పరిశీలన. అది చాలా అద్భుతమైనది. మన చుట్టూ వుండే మనుష్యులు.. వారి ప్రవర్తన ను పరిశీలించటం వల్ల కూడ చక్కని వ్యక్తిత్వం ఒనగూరుతుంది. వ్యక్తులే కాదు, గ్రహించగలిగే శక్తే ఉండాలే కాని, ఈ అనంతమైన సృష్టిలో మనకు స్ఫూర్తినివ్వనిది.. ఇవ్వలేనిదేముంది..? తుఫానులో విపరీతమైన గాలి వానకు, కూకటి వేళ్ళతో కూలిపోయే మహావృక్షాలు ఉంటాయి. ఆ పక్కనే భూమి మీద ఒరిగి పోయి.. గాలివాన తరువాత మళ్ళీ నిటారుగా నిలబడి తమ ఉనికి చాటుకునే గడ్డిపరకలూ ఉంటాయి. అక్కడివరకూ మన పరిశీలనా దృష్టిని సారించగలగాలి. కష్టాలు, బాధల తుఫానులతో అతలాకుతలమయ్యే వేళ గడ్డిసరకని ఆదర్శంగా తీసుకుంటే ధైర్య స్థైర్యాలు అలవడతాయి. ఇవి గొప్ప వ్యక్తిత్వపు లక్షణాలే కదూ! మనం పుట్టిన ప్రదేశం.. దాని శీతోష్ణ స్థితులు.. కుటుంబ నేపథ్యం.. ఆర్థిక స్థితి.. ఇవన్నీ మన ఆలోచన రీతిని ప్రభావితం చేసేవే. ఆ ప్రభావిత ఆలోచనలు మన మాట తీరును.. ప్రవర్తనను నిర్దేశిస్తాయి. వీటి సారమే కదా మన వ్యక్తిత్వం. ఇదే మన జీవనశైలి అనే రథానికి సారథి. కొందరి మనసు వజ్ర దృఢ సమానమైన కఠినం. ఇంకొందరిది వెన్నంత మృదుత్వం. మరికొందరిది ఈ రెండిటి కలవోత. ఈ రెండిటికి చెందక పాదరసంతో పోల్చతగ్గ వ్యక్తిత్వం కలవాళ్ళుంటారు. ఒక స్థిరమైన ఆలోచన.. వైఖరి.. లేక వారి ప్రవర్తన.. మాట.. అనూహ్యంగా క్షణ క్షణానికి మారిపోతుంటాయి. అభిప్రాయాలూ అంతే. ‘ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి.. ‘ అన్న సుమతీకారుడి మాటలకు ప్రత్యక్షరూపమే కొందరి వ్యక్తిత్వం. మాటలు తూచి తూచి మాట్లాడతారు. ఎవరి మనస్సు నొప్పించరు. మృదుస్వభావులు. వివాద రహితులు. జనప్రియులు. తన వారన్నవారందరిని కోల్పోయి, అనాథలై, అభాగ్యులై జీవన సమరంలో అతి చిన్నవయసులో ప్రవేశించే వారి ఆలోచన, వారి సమాజపు ఆకళింపు పూలపాన్పు జీవిత నేపథ్యం ఉన్నవారి కన్నా భిన్నంగా ఉంటుంది. పలుకు పదునుగా, కరకుగా ఉంటుంది. జీవన పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యులకు ఈ మనస్తత్వమున్నవారు చేరువవుతారు. దానిని అక్కున చేర్చుకుంటారు. వ్యక్తిత్వాలలో ఎన్నిరకాలుంటాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పలేనన్ని.. గణించలేనన్ని– అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతివ్యకి ఒకరకమైన వ్యక్తిత్వానికి నమూనా. ప్రతివ్యక్తిలోనూ వుండే విభిన్నత..ౖ వెవిధ్యమే ఇందుకు హేతువు. మంచి వ్యక్తిత్వ వర్గీకరణకు.. నిర్వచనానికి మనం కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటాం. ఏ వ్యక్తి పేరు తలచుకోగానే మన మనసుకు ఒక రకమైన హాయి.. ఆనందం కలిగి మన ముఖంపై చిరునవ్వు చిందుతుందో, ఎవరి ప్రవర్తన మన మనస్సును నొప్పించదో అతడు మంచివాడని.. అతనిది మంచి వ్యక్తిత్వమని భావిస్తాం. వారి గురించి ఆలోచన మన మదిలో మెదలగానే మనసంతా పరిమళ భరితమవుతుంది. ఇది ఒక అవగాహన. ఏ వ్యక్తుల పేర్లు తలచుకోగానే మనకు భక్తి, ప్రపత్తులు కలుగుతాయో... దేశభక్తి మనలో ఉప్పొంగుతుందో.. త్యాగనిరతి జ్ఞప్తికి వస్తుందో.. వారి ఉన్నతమైన మానవీయ లక్షణాలు తడతాయో.. నిర్భయత్వం.. ప్రేమ, కరుణ మనకు స్ఫురిస్తుందో .. ఆ వ్యక్తులందరూ గొప్పవారే... వారి వ్యక్తిత్వాలన్నీ గొప్పవే .. స్ఫూర్తిదాయకమైనవే. మనం ఏ వ్యక్తిత్వానికి చేరువవుతామన్నది మన స్వభావాన్ని బట్టి ఉంటుంది. మన జీవిత నేపథ్యం కూడ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వం దేశాన్ని ఉత్తమమైనదిగా చేస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని పిల్లల్లో రూపు దిద్దటానికి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రయత్నించాలి. కొందరు మనస్సులో ఏదైనా ఆలోచన తట్టిన క్షణమే పని చేసేస్తారు. లేడికి లేచిందే పరుగులా వాళ్ళనుకున్నది చేయటమే వారి తత్వం. ముందు వెనుకలు చూడరు. లోతుగా తరచి చూడరు. సాధ్యాసాధ్యాల గురించి యోచన చేయరు. పర్యవసానాలు దర్శించగలిగే శక్తే ఉండదు. ఈ వ్యక్తిత్వం కలిగినవారు వారు ముప్పును తెచ్చుకోవటమే కాదు. ఇతరులకూ తెస్తారు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
మానవతా శిఖరం మహాత్ముడు
నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఘర్షణ వాతావర ణమే. కులాలు, మతాలు, జాతి వైరాలతో హింస తాండవిస్తోంది. గాంధీజీ భావాలను, సాధించిన విజయాల్ని తలచుకుంటే మానవజాతి భవితపై కమ్ముతున్న కారు చీకట్ల మధ్య జాతిపిత ఒక కాంతికిరణం అనిపిస్తుంది. గాంధీజీ పరిపూర్ణ వ్యక్తి. సత్యాన్వేషణలో తన జీవితాన్ని ప్రయోగశాలగా మలుచుకున్న గొప్ప శక్తి. స్వార్థం, అర్థంలేని వస్తు వ్యామోహం... ఇలా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్య లకు తన ఆత్మకథలో పరిష్కారాలు చూపారు. విద్యార్హతలు, హోదా మనిషిని గౌరవించడానికి కొలమానాలు కావంటారు. ఎదుటి మనిషిని ఆత్మ రూపంగా, సత్య రూపంగా చూడమంటారు. ఆ ఆధ్యాత్మిక, నైతిక దృష్టికోణాన్ని అలవర్చుకోగలి గితే మానవ సంబంధాలతో ముడిపడిన తొంభై శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని గాంధీ మార్గం సూచిస్తుంది. ఎంత చదివినా, ఎంత సంపాదించినా ఆధు నిక జీవితం సమస్యాత్మకమే అవుతోంది. ఏదో అసంతృప్తి, ఆవేదన కనిపిస్తున్నాయి. వాస్తవానికి గాంధీ సైతం ఒక దశలో అలాంటి ఆలోచనల్లో పడిన వారే. అప్పుడే సత్యశోధన అంకురించింది. తాను వెళుతున్న మార్గం ఎంత తప్పో గ్రహించారు. రెండు గదుల ఇంటి నుండి ఒక గదికి మారారు. హోటల్ భోజనం నుండి స్వయంపాకంలోకి వచ్చారు. సరళ జీవితం సమయాన్ని ఆదా చేసింది. అప్పుడే తన జీవితం సత్యమైనదన్న గ్రహింపు కలిగి ఆత్మ సంతృప్తి కలిగిందంటారు గాంధీ. ఆయన దృష్టిలో సత్యం అంటే మాటకు సంబం ధించింది మాత్రమే కాదు; అది ఆలోచన, ఆచరణ లతో ముడిపడింది కూడా. గాంధీ మార్గంలో మరో అడుగు పశ్చాత్తాపం. నీటితో బురదను కడుక్కున్నట్లు పశ్చాత్తాపంతో పాపాల్నీ, లోపాల్నీ శుభ్రపరచుకోవచ్చు అని నిరూపించారు. అపరాధం చేశానని భావించిన ప్రతిసారీ ఉత్తరాల రూపంలో క్షమాపణ కోరేవారు. అలాగే ఉపవాసాన్ని ఒక బలమైన ప్రాయశ్చిత్త మార్గంగా భావించారు. గాంధీ మార్గంలో మరో మజిలీ అహింస. సత్యం అనే గమ్యాన్ని చేరుకోవ డానికి అహింసే ప్రధాన మార్గం అని భావించారు మహాత్ముడు. సమస్యలు, సంక్షోభాలు ఎన్ని వచ్చినా ఆ మార్గాన్ని వీడలేదు. సత్యసంధత వల్ల క్రోధం, స్వార్థం, ద్వేషం సమసిపోతాయి. రాగ ద్వేషాలు ఉన్న వ్యక్తి ఎంత మంచివాడైనా శుద్ధ సత్యాన్ని దర్శించలేడని చెబుతారు. స్వాతంత్య్ర సమరం అహింసా మార్గంలో జరిగింది కాబట్టే శత్రువులుగా ఉండాల్సిన బ్రిటిష్‌వారు సైతం గాంధీజీని మహనీయుడిగా భావించారు. గాంధీజీ అన్ని మతాలకు సమాన స్థానం ఇచ్చారు. కేవలం మత పాండిత్యం వ్యర్థం అన్నారు. ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. అది భగవంతుడిపై ఆత్మకు ఉండే గాఢమైన అను రక్తి. తన సమస్తం దైవానిదేనని భావించి, ఆ భావం మీదే మనస్సు కేంద్రీకరించడం. దైవానికీ, మానవ రూపంలో కనిపించే మాధవుడికీ సేవ చేయడానికి తన జీవి తాన్ని అంకితం చేసిన దివ్య శక్తిమయుడు. విద్యా విధానం, అంట రాని తనం, హరిజనో ద్ధరణ, ఖద్దరు విని యోగం, ఉపవాస దీక్ష... ఇలా ప్రతి అంశంపైనా గాంధీజీకి స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. స్వతంత్ర భారతంలో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలన్న అంశం పైనా ప్రత్యేక అభిప్రాయాలు ఉండేవి. గాంధీజీ అంతర్జాతీయవాది. ప్రపంచ శ్రేయంలోనే దేశ శ్రేయం ఉందని భావించారు. గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను ఆచరిస్తే – సరిహద్దు గొడవలు, జాతి వైషమ్యాలు, మతకలహాలు కనుమరుగవుతాయి. జగమంతా శాంతిమయం అవుతుంది. (నేడు గాంధీ జయంతి) డా. అశోక్ పరికిపండ్ల వ్యాసకర్త గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ తెలంగాణ కన్వీనర్ ‘ 99893 10141 -
ప్రముఖ నటుడు,యాడ్ గురు కన్నుమూత
సాక్షి,ముంబై : ప్రముఖ నటుడు, ఐకానిక్ యాడ్ ఫిల్మ్ మేకర్ అలెక్యూ పదంసీ (90) కన్నుమూశారు. శనివారం ఉదయం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. పదంసీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. అలెక్యూ లింటాస్ ఇండియా యాడ్ ఏజెన్సీ స్థాపించి ప్రఖ్యాతి గాంచారు. ఎన్నో సృజనాత్మకమైన యాడ్స్‌ను తీసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా లిరిల్, హమారా బజాజ్, కామసూత్ర కపుల్, ఎంఆర్ఎఫ్ లాంటి ప్రజాదరణ పొందిన యాడ్స్ ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నవే. 2000 సంవత్సరంలో పద్మశ్రీ దక్కింది. ఇండియన్ ఎడ్వర్టైజింగ్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీ అవార్డుతో ఆయనను ఎడ్వర్టైజింగ్ క్లబ్ సత్కరించింది. అలాగే రిచర్డ్ అటెన్‌బరో ప్రముఖ చిత్రం గాంధీలో ముహమ్మద్ అలీ జిన్నా పాత్ర పోషించారు అలెక్యూ లింటాస్ ఇండియా ఫౌండర్, మోడరన్ ఇండియన్ ఎడ్వర్టైజింగ్ యాడ్ గురు ఇక లేరన్న వార్త ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో సోషల్ మీడియాలో సంతాప సందేశాల వెల్లువ కురిసింది. ముఖ్యంగా అలెక్యూ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇంకా పలువురు పరిశ్రమ పెద్దలు, ఆర్టిస్టులు అలెక్యూ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. Sorry to hear of the passing of Alyque Padamsee, creative guru, theatre personality and doyen of our ad industry. My condolences to his family, friends and colleagues #PresidentKovind — President of India (@rashtrapatibhvn) November 17, 2018 Woke up to the saddest news of my guru and mentor #AlyquePadamsee is no more. He hired me and Chax personally in 1992 for #Lintas . This was my last picture with him few months ago. I share my grief with his family. May his Soul rest in peace. pic.twitter.com/C8G6nfX4PV — K V Sridhar (@kvpops) November 17, 2018 #AlyquePadamsee you are an icon; one of the first ad men to have inspired us all. You have blazed a trail! You will be forever missed. #RIP https://t.co/FZlL0bmmvD — Sudhanshu Vats (@Sudhanshu_Vats) November 17, 2018 RIP Alyque Padamsee. The ad legend who gave us some of the iconic ad images of the 70s and 80s. Surf’s Lalitaji and Liril’s waterfall girl in the green bikini. pic.twitter.com/ZUP1GQbF65 — Lloyd Mathias (@LloydMathias) November 17, 2018 -
మీ వ్యక్తిత్వంలో పరిణతి ఉందా..?
ఎంతకాలం గడిచినా కొంతమంది మానసికంగా పరిణతి సాధించలేరు. అంతా బాగానే ఉన్నా, కొందరికి సమాజంలో ఎలా ప్రవర్తించాలో, తోటివారితో ఎలా నడుచుకోవాలో తెలియదు. అందరిలో పెద్దగా అరవటం, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక, అభాసుపాలవటం మొదలైన లక్షణాలు పరిణతిలేని వారిలో కనిపిస్తుంటాయి. మెచ్యూరిటీ అందరిలో ఒకే సమయంలో ఒకే రకంగా జరగకపోవచ్చు. ఇది నిర్ణయాలు తీసుకొనే శక్తి, ప్రజ్ఞ, స్పృహ, వయసు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది లేదని బాధపడి న్యూనతకు గురయ్యేకన్నా పరిణతి ఎలా సాధించవచ్చో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం మంచిది. మీరు మెచ్యూర్డ్ పర్సన్ అవునో కాదో తెలుసుకోవాలంటే ఈ క్విజ్ పూర్తిచేయండి. 1. ఎవరినీ అర్థం చేసుకోకుండా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. మీరనుకన్నది జరగకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఎ. కాదు బి. అవును 2. మీ బలాలు బలహీనతనలు గుర్తించగలరు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీ సహనాన్ని కోల్పోరు. ఎ. అవును బి. కాదు 3. ఎవరైతే నాకేంటి, ఇతరులను నేనెందుకు లెక్క చేయాలి? అనే అహంభావం మీలో ఉంటుంది. ఎ. కాదు బి. అవును 4. ఎలాంటి విషయాన్నైనా రిసీవ్ చేసుకోగలరు. అందరి మర్యాదలు మీకు లభిస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 5. ఎలాంటి పరిస్థితుల్లోనూ నైతిక విలువలను మరచిపోరు. అబద్ధం, దొంగతనం, మోసం మొదలైనవాటికి దూరంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 6. చేసిన పొరపాట్లను వెంటనే ఒప్పుకోరు. ఇతరులకు మీ వల్ల అసౌకర్యం కలిగితే క్షమాపణలు అడగటం మీకిష్టం ఉండదు. ఎ. కాదు బి. అవును 7. జాగ్రత్తగా, హుందాగా ఉండాల్సిన సమయాల్లో ఎలా ఉండాలో, సరదాగా ఉండాల్సినప్పుడు ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. మీ కష్టాలకు ఇతరులను కారకులుగా భావిస్తారు. వారివల్లే మీకు నష్టం జరిగిందని చెప్తుంటారు. ఎ. కాదు బి. అవును 9. మిమ్మల్ని మీరు ఎప్పటికీ కించపరచుకోరు. ఆత్మ గౌరవం మీకుంటుంది. ఎ. అవును బి. కాదు 10. బాధ్యతాయుతంగా ఉంటారు. మీరు నిర్వర్తించవలసిన పనులను ఎప్పటికీ మరచిపోరు. విశాలదృక్పథంతో ఉంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు నాలుగు దాటితే మీలో పరిణతి పూర్తి స్థాయిలో ఉండదని అర్థం. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు మెచ్యూర్డ్ పర్సన్. చుట్టూ ఉన్న సమాజం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుంటారు. జ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే జీవితంలో మీరింకా పరిణతి సాధించలేదనే చెప్పాలి. దీనివల్ల ఎక్కడకు వెళ్లినా మీకు ఇబ్బందులు తప్పవు. డోన్ట్ వర్రీ పరిణతి అందరిలో ఒకేరకంగా ఉండదు. ఇది లెర్నింగ్ ప్రాసెస్. అనుభవాలను సోపానాలుగా చేసుకోండి. చేసిన పొరపాట్లను మళ్లీ చే యకుండా ఉండండి. ‘ఎ’ లను సూచనలుగా తీసుకోండి. -
మీరు అట్రాక్టివ్ పర్సనా.. కాదా..?
ట్విట్టర్ ఖాతా ఉందా.. అయితే తాజా సర్వేలో వీరిపై కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ సైకలాజికల్ సర్వే నిర్వహించింది. ఇందుకు సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ను మాధ్యమంగా చేసుకుని సర్వే చేసింది. దాదాపు 66 వేల మంది ఖాతాదారుల ట్విట్టర్ ప్రొఫైల్ ను పరిశీలించింది. ప్రొఫైల్ ద్వారా మనం ఎంత అట్రాక్టివ్ వ్యక్తులం, వారి హావభావాలు ఎలా ఉంటాయన్నది సర్వేలో వెల్లడైంది. వ్యక్తులు మొత్తం ఐదు గ్రూపులని విభజించారు ప్రొఫైల్ పిక్చర్ తమ ఫొటో, పెంపుడు జంతువులు, మరేదైనా ఫొటోలు అప్ లోడ్ చేసినవారు.. ఇలా అన్ని రకాల వ్యక్తుల ఖాతాలపై సర్వే జరిగింది. ఫ్రొఫైల్ డాటా గమనిస్తే.. కేవలం ఫాలోయర్స్, ట్వీట్స్, రీట్వీట్స్ మాత్రమే కాదు ఆ వ్యక్తి స్వభావం ఏంటన్నది తెలుస్తుందట. ముఖ్యంగా న్యూరోటిసిమ్ కలిగిన వ్యక్తులు టెన్షన్ గా ఉంటారని, అగ్రిబుల్ నెస్ ఉన్న వారు చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోష పెట్టడం అలవాటని కనుగొన్నారు. కలర్ ఫుల్ ఫొటోలు పెట్టే తరహా వారు గట్టిగా నవ్వేస్తుంటారని, నవ్వడం వారికి సహజగుణమని చెప్పారు. కాన్సెన్షియస్ తరహా వ్యక్తులు చాలా క్రమశిక్షణతో మెలుగుతారని, పాత జ్ఞాపకాలు, పాత మిత్రులను కలుసుకోవడం వారితో కాలక్షేపం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారట. మరికొందరు వ్యక్తులు ఏ విషయాన్నయినా సూటిగా, స్పష్టంగా చెప్పేస్తుంటారు. కోపం వచ్చినా, సంతోషం కలిగినా కారణాలను వెల్లడిస్తారని రీసెర్చర్స్ పేర్కొన్నారు. రోజుకు 8 ట్వీట్లు చేసినట్లయితే ఆ యూజర్ ఎలాంటి తరహా వ్యక్తి, వారు ఎక్కడ ఉంటారు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చని ఇటీవల సర్వేలో తేలిన విషయం తెలిసిందే. -
'నటిగా రాణించనేమోనని భయపడ్డా'
ముంబై: నటికి కావాల్సిన శరీరాకృతి తనకు లేదని సినిమాల్లోకి రాకముందే భయపడేదాన్నని, నటిగా రాణిస్తానన్న ఆత్మవిశ్వాసం అప్పట్లో లేదని బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ చెప్పింది. సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించినా, నిజజీవితంలో తనది బిడియ స్వభావమని అంది. 'ప్రతి విషయానికి భయపడేదాన్ని. బిడియ స్వభావం వల్ల ఇతరులతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నటికి కావాల్సిన అందం నాలో లేదని భావించేదాన్ని. సినీ పరిశ్రమలోకి వచ్చాక ఈ బలహీనతలను క్రమంగా అధిగమించాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి' అని సోనమ్ కపూర్ చెప్పింది. -
తనను తాను అతిగా ప్రేమించుకునే జబ్బు!
మెడి క్షనరీ తనను తాను ప్రేమించుకోవడం అందరికీ ఉండే సహజాతం. ఇదే లేకపోతే మనిషి మనుగడే కష్టం. అయితే కొందరు తమ గొప్పలు తాము అదేపనిగా చెబుతుంటారు. ఇది కూడా పెద్ద సమస్య కాదు. నిజానికి అలా ఉండటం వల్లనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కానీ తన సామర్థ్యాలను అతిగా ఊహించుకొని తప్పులు చేస్తుంటే మాత్రం ఇది సమస్య అవుతుంది. తనను తాను ప్రేమించుకోవడం మితిమీరితే దాన్ని ఒక మానసిక సమస్యగా పరిగణిస్తారు నిపుణులు. దీన్ని వ్యక్తిత్వానికి, మూర్తిమత్వానికి (పర్సనాలిటీ)కి సంబంధించిన ఆరోగ్య సమస్యగా డాక్టర్లు పేర్కొంటారు. ఇలా తమ పట్ల తమకు ఉన్న అతి ప్రేమ రుగ్మతను నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎన్పీడీ)గా చెబుతారు. ఒకరు తనను తాను ఎంతగా ప్రేమించుకుంటాడనేందుకు ‘నార్సిసస్’ అనే వ్యక్తి ఒక తార్కాణం. ఆ గ్రీకు పురాణపురుషుడు నీళ్లలోని తన ప్రతిబింబాన్నీ తాను చూసుకొని ఎప్పుడూ మురిసిపోతుంటాడు. ఆయన పేరిటే ఈ రుగ్మతకు ‘నార్సిస్టిక్ పర్సనాటిటీ డిజార్డర్’ అనే పేరు వచ్చింది. -
కళ్లు చూసి వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చు!
న్యూఢిల్లీ: ఇంతవరకు ఒకరి చేతిరాతిను బట్టి, వారు పడుకునే పొజిషన్ ఆధారంగా, బాడీ లాంగ్వేజ్‌ను అనుసరించి వారి పర్సనాలిటీ చెప్పొచ్చనే విషయం తెలుసు. కానీ కళ్ల వర్ణాన్ని బట్టి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో ఒక్కొక్కరి కళ్లు ఒక్కో రంగులో ఉంటాయి. ఆయా రంగులను అనుసరించి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మధు కోటియా చెబుతున్నారు. ఆమె అంచనాలు ఇవి.. నల్ల కళ్లు: ఈ రంగు కళ్లను చూడగానే ఏదో రహస్యాన్ని కలిగా ఉన్నాయి అనే భావన కలుగుతుంది. అయితే వీరు ఎక్కువ విశ్వాసులై ఉంటారు. ఒకరి రహస్యాలను మరొకరితో పంచుకోరు. బాధ్యతాయుతంగా, విధేయంగా ఉండడంలో వీరి తర్వాతే ఎవరైనా. తమ ప్రతిభను ఇతరులకు ఎలా చూపించాలో వారికి బాగా తెలుసు. ఎక్కువ కష్టపడే గుణం వీరి సొంతం. గోధుమ రంగు కళ్లు: ఈ రంగు కళ్లు కలిగిన వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. వీరు ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని, సృజనాత్మకతను కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు ఇతరులకు కొంచెం కఠినమైన వ్యక్తిత్వం కలవారిగా కనిపిస్తారు. లేత గోధుమ రంగు కళ్లు: ఈ రంగు కళ్లున్నవారు ఎక్కువ సరదాగా ఉంటారు. ఇతరులను ఎక్కువగా నవ్వించే స్వభావం వీరికి ఉంటుంది. సాహసాలు చేయడానికి కూడా ఇష్టపడతారు. సందర్భోచితంగా, సమయానుకూలంగా మెలిగే నేర్పుని కలిగి, ఏ పరిస్థితినైనా అర్థం చేసుకుంటారు. మంచి మనసు కలిగి ఉండే వీరు ఒకే తరహాగా ఉండేందుకు ఇష్టపడరు. వీరు ఎదుటివారిని త్వరగా ఆకర్షించగలిగినప్పటికీ ఇతరులతో ఎక్కువ కాలం ఆ బంధాన్ని కొనసాగించలేరు. బూడిద రంగు కళ్లు: ఈ రంగు కళ్లు ఉంటే వారు దృఢ చిత్తులై, హుందాతనంతో వ్యవహరిస్తారు. కొంచెం ఆధిపత్య స్వభావం వీరి సొంతం. గొడవలు, కోపానికి వీలైనంత దూరంగా ఉంటారు. శక్తియుక్తులన్నింటినీ లక్ష్యంపైనే పెడతారు. ప్రేమ, అనురాగాలు వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారి మానసిక బలం, ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక ధోరణి వారిని ఏ పరిస్థితిలోనైనా నెగ్గుకు రాగలిగే నాయకులుగా మారుస్తుంది. పచ్చ రంగు కళ్లు: ఈ రంగు కళ్లున్న వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సుకత ప్రదర్శిస్తారు. జీవితంపై, అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కానీ వీరికి త్వరగా అసూయపడే స్వభావం ఉంటుంది. నీలి రంగు కళ్లు: ఎదుటివారిని త్వరగా ఆకర్షించడం, శాంతియుతమైన ధోరణి కలిగి ఉండడం ఈ రంగు కళ్లున్న వారి ప్రత్యేకత. చాలా తెలివితేటలు కలిగి ఉండడమే కాకుండా, ఇతరులతో అనుబంధాల్ని ఎక్కువ కాలం కొనసాగిస్తారు. నిజాయితీ, దయ లాంటి లక్షణాలతో ఇతరులు సంతోషంగా ఉండడానికి తోడ్పడతారు. చుట్టుపక్కల విషయాల్ని సునిశిత దృష్టితో పరిశీలిస్తారు. -
కత్తిలాంటి నిజం!
చరిత్ర రాబిన్ హుడ్ నిజంగానే ఉన్నాడా? కల్పిత పాత్ర? అనే చర్చలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘‘ఇలాంటి మనిషి ఒకడుంటే ఎంత బాగుండేది!’’ అని ఆశించే రచయితల కల్పనలో నుంచి పుట్టిన పాత్ర ‘రాబిన్‌హుడ్’ అని కొందరు అన్నారు. ‘‘అదేమీ కాదు. రాబిన్‌హుడ్ నిజంగానే ఉన్నాడు. రోజర్ గాడ్బెర్డ్ అనే రైతే...రాబిన్ హుడ్!’’ అని బలంగా వాదించిన వారూ ఉన్నారు. ఈ వాదానికి బలం చేకూరుస్తూ డేవిడ్ బాల్డ్విన్ అనే ఆయన ‘రాబిన్ హుడ్: ది ఇంగ్లీష్ ఔట్లా అన్మాస్క్డ్’ పేరుతో పుస్తకం కూడా రాశారు. ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే...‘‘రాబిన్ హుడ్ దారి దొంగ మాత్రమే...అంతకు మించి ప్రాధాన్యత లేదు’’ అని కొందరు నమ్మితే ‘‘దారిదొంగ, గజదొంగ అనే మాటలు నిజమేగానీ, మానవత్వం మూర్తీభవించిన దొంగ. పెద్దలను దోచి పేదలకు పెట్టేవాడు’’ అని కొందరు కీర్తించేవారు. ఇక రాబిన్‌హుడ్ ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏ అడవిలో సంచరించాడు? అతని స్థావరం ఏమిటి? అనేదాని గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ వాదనలలో పుస్తకాలలో సమాచారం తప్ప ‘భౌతిక ఆధారాలు’ పెద్దగా తొంగి చూడలేదు. తాజా విషయం ఏమిటంటే... ‘‘రాబిన్‌హుడ్ యాంక్షైర్(ఇంగ్లాండ్)కు చెందిన వాడే అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అంటున్నారు డాన్‌కాస్టర్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీకి చెందిన ఉద్యోగులు. డాన్‌కాస్టర్ మ్యూజియం క్యూరేటర్ క్లారన్ డాల్టన్ 14వ శతాబ్దానికి చెందిన కత్తిని మీడియా వర్గాలకు చూపుతూ చాలాసేపు మాట్లాడారు. ‘‘రాబిన్‌హుడ్ యాంక్షైర్కు చెందిన వాడు అని చెప్పడానికి ఇదొక ఆధారం మాత్రమే’’ అని చెప్పారు ఆమె. బహుశా...యాంక్షైర్లో రాబిన్‌హుడ్ తిరుగాడిన ప్రాంతంలో ఈ కత్తి దొరికి ఉంటుంది. తమ వాదనకు బలం చేకూర్చే మరిన్ని భౌతిక ఆధారాలు కూడా ఉన్నాయని డాల్టన్ చెబుతున్నారు. ఈ భౌతిక ఆధారాల గొడవ మాట ఎలా ఉన్నా...రాబిన్ గురించి మరోసారి తృప్తిగా మాట్లాడుకునే అవకాశం ఆయన అభిమానులకు కలిగింది. -
ఎలాగూ చనిపోతాం... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది!
రామ్‌గోపాల్ వర్మ... ఈ పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున స్ఫురించేది ఓ విలక్షణ వ్యక్తిత్వం. ఆయన మాటలైనా, చేతలైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే. సినిమా హిట్టు, ఫ్లాపులతో ఆయనకు సంబంధం లేదు. వాటికి అతీతంగా అనునిత్యం వార్తల్లో ఉండడం వర్మలోని విశేషం. మరి, అలాంటి విలక్షణ వ్యక్తి ఎవరిని చూసి ప్రభావితమయ్యారు? దేన్ని చూసి, ఏం చదివి ప్రేరణ పొందారు? ఎవరి మీదైనా సరే మాటల తూటాలు పేల్చే ఈ మనిషికి బతుకు మీద భయం లేదా? రండి... రామూను అడిగేద్దాం... ఆయన మాటల్లోనే వివరణ వినేద్దాం. అతని తెలివితేటల ముందు నేనో పురుగులా అనిపించేవాణ్ణి! నన్ను ప్రధానంగా ప్రభావితం చేసిన వ్యక్తి - ఇంజినీరింగ్ కాలేజ్‌లో నాకు జూనియర్ అయిన నా స్నేహితుడు సత్యేంద్ర. అతను చాలా తెలివైనవాడు. ఇంటర్నెట్ లాంటివేవీ లేని ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు చదువుకోవడానికి వచ్చిన పద్ధెనిమిదేళ్ళ అతను ఆ తరం విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు. ఆరు నెలల పాటు నేను, అతను రూమ్మేట్లం. అతనితో మాట్లాడుతుంటే, అదో చెప్పలేని అనుభూతి. ఒకసారి పరీక్షల ముందు నేను, సత్యేంద్ర విజయవాడలోని లీలామహల్లో ఓ ఇంగ్లిషు సినిమాకు వెళ్ళాం. సత్యేంద్ర ఆ సినిమా చూడడం అప్పటికి ఏడోసారి. ఇంతలో మా కాలేజ్ ప్రిన్సిపాల్ తుమ్మల వేణుగోపాలరావు కూడా అదే సినిమాకు వచ్చారు. ‘ఏమిటి ఇలా వచ్చార’ని ఆయన అడిగితే, ‘మీరు కాలేజ్‌లో నేర్పే దాని కన్నా, ఈ సినిమాల ద్వారా నేర్చుకునేది ఎక్కువ. అందుకే, ఈ సినిమాకు ఏడోసారి వచ్చా’ అన్నాడు సత్యేంద్ర. ‘ఈ సినిమా నేను చూశాను. ఇందులో అంత ఏముంది?’ అన్నారు ప్రిన్సిపాల్. ‘మీకు కనిపించనిదేదో, నాకు కనిపించింది’ అన్నాడు సత్యేంద్ర. చూడడానికి అతని మాట తీరు అలా నిర్లక్ష్యంగా అనిపించినా, అంత తెలివైన విద్యార్థిని నేను చూడలేదంటే నమ్మండి. చివరకు, మా ప్రిన్సిపాల్ గారు కూడా ఓ సందర్భంలో ‘నేను మరువలేని విద్యార్థి’ అంటూ సత్యేంద్ర మీద చాలా గొప్పగా ఓ వ్యాసం రాశారు. దాన్నిబట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి. అవడానికి కాలేజీలో నాకు జూనియర్ అయినా, సత్యేంద్ర మాటలు, అతను ప్రస్తావించిన పుస్తకాల పఠనం నన్నెంతగానో మార్చేశాయి. అతనితో మాట్లాడితే, మనకు తెలియని ఓ అభద్రత కలుగుతుంది. ఆయన తెలివితేటల ముందు మనమంతా పురుగులలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు సత్యేంద్ర. ఈ మధ్యే మూడు నెలల క్రితం కూడా అతనితో ఫోన్లో మాట్లాడాను. అతని మాటల్లోని తార్కికత మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. మనలోని అజ్ఞానపు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతూ, ఉంటాయి. ‘భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ లాంటి ప్రకటనల వెనుక ఉన్న మన అంతరంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కేవలం దేశాన్ని ప్రేమిస్తున్నావా, ఇక్కడి వ్యక్తులను ప్రేమిస్తున్నావా, కులాలు - మతాలు - ప్రాంతాల లాంటి విభేదాలు ఏమీ లేకుండా వ్యక్తులను ప్రేమించగలవా అని ఆయన చెప్పే తర్కం ఆలోచనలో పడేసేది. మనలో గూడు కట్టుకున్న స్థిరమైన అభిప్రాయాలనూ, భావాలనూ అతని మాటలు ఛిన్నాభిన్నం చేసేస్తాయి. నా జీవిత తాత్త్వికత అంతా ఆ పుస్తకాల ప్రభావమే! సత్యేంద్ర తరువాత నన్ను అమితంగా ప్రభావితం చేసినవి పుస్తకాలే. ఇంటర్మీడియట్ చదువుతుండగానే నేను కాల్పనిక సాహిత్యమంతా చదివేశాను. కాల్పనికేతర సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాకే చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఫిలాసఫీ పుస్తకాలు, అందులోనూ పొలిటికల్ ఫిలాసఫీ పుస్తకాలు తెగ చదువుతుంటాను. వాటిని నాకు పరిచయం చేసింది సత్యేంద్రే. ఆయన స్నేహం వల్లే నేను జర్మన్ తత్త్వవేత్త నీషే, అయన్ ర్యాండ్ లాంటి ప్రసిద్ధులు రాసిన పుస్తకాలు చదివాను. అయన్ ర్యాండ్ రచనలన్నీ దాదాపు చదివేశాను. ముఖ్యంగా ఆమె రచనలు, నీషే రాసిన ‘దజ్ స్పేక్ జరాథుస్త్రా’ - నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నట్లు నేను ఇందాక చెప్పిన సత్యేంద్ర కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలోచనలతో నిండిన ఆ పుస్తకం జనం ఆలోచించే తీరును మార్చి వేస్తుందని ఆయన నమ్మకం. కచ్చితంగా అది ఓ సంచలనమవుతుంది. తెలుగు పుస్తకాల విషయానికి వస్తే, నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం’ చదివాను. అలాగే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, చలం రచనలు చదివాను. చలం మంచి రచయితే కానీ, ఆ భావాలు అప్పటికి కూడా కొత్త ఏమీ కాదు. అవన్నీ ప్రపంచ ప్రసిద్ధులైన నీషే తదితరుల తాత్త్వికతలో ఉన్నవే. ఆ సినిమాల జాబితా చాలా పెద్దది! ప్రపంచ సినీ చరిత్రలో ఆణిముత్యాలని చెప్పదగ్గ చిత్రాలు కొన్ని నా మీద ప్రభావం చూపాయి. వాటి జాబితా పెద్దదే. అయితే, చటుక్కున నాకు గుర్తొచ్చే సినిమాలు - ‘గాడ్ ఫాదర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఎగ్జార్సిస్ట్’. భారతీయ సినిమాల్లోకి వస్తే ‘షోలే’, ‘అర్ధ్ సత్య’ లాంటివి నన్ను ప్రభావితం చేశాయి. అలాగే, నా మీద ప్రభావం చూపాయని అనలేను కానీ, నేను బాగా ఇష్టపడిన తెలుగు సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, బాలచందర్ గారి సినిమాల లాంటివి నాకెంతో ఇష్టం. అలాగే, షార్ట్‌ఫిలిమ్‌లు, నేషనల్ జాగ్రఫీ చానల్లో వచ్చే డాక్యుమెంటరీలు కూడా తరచూ చూస్తూ ఉంటాను. వాటి ప్రభావం నా మీద కొంత ఉంది. నాకెప్పుడూ, దేనికీ భయం లేదు! అవతలివాళ్ళను భయపెట్టడం నాకు ఇష్టం. కానీ, చిత్రమైన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడూ భయం అనిపించదు. చాలా ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని లాతూరులో భయంకరమైన భూకంపం వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను బొంబాయిలో ఎనిమిదో అంతస్థులోని ఇంట్లో ఉన్నా. భవనమంతా ఒక్కసారిగా భయంకరంగా ఊగుతోంది. భూకంపం వచ్చిన విషయం నాకు అర్థమైంది. కిందకు వెళదామని అనుకున్నా. కానీ, వెంటనే ఈ లోపలే భవంతి కూలిపోయి చనిపోతామేమోలే... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది. అంతే! అక్కడే ఉండిపోయి, భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నా. భవంతి గోడలు విరిగినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చున్నా! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల -
బాధ నుంచి పుట్టిన ఆలోచనకు బ్రహ్మరథం
విజయం జబ్బు పడ్డాక చికిత్స చేయించుకోవడం కంటే, జాగ్రత్తపడడం మేలు! ఈ మంచి మాటను తరచుగా వింటుంటాం కానీ చెవికెక్కించుకోం! మన కుటుంబంలోనే ఒకరు జబ్బు పడ్డాక ఈ మాట విలువేంటో అర్థమవుతుంది. కానీ చేసేదేముంది? జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ముంబయికి చెందిన కంచన్ నైకవాడి కూడా ఇలాగే నష్టపోయారు. తన తండ్రిని కోల్పోయారు. ఐతే నష్టం జరిగిపోయింది కదా అని ఆమె ఊరుకోలేదు. అందుకోసం కంచన్ ఎంచుకున్న మార్గం.. ఆమెను ఓ మానవతావాదిగానే కాదు, గొప్ప వ్యాపారవేత్తగానూ మార్చింది! వంద కోట్లకు పైగా టర్నోవర్ సాధించిన ఇండస్ హెల్త్ ప్లస్ సంస్థ అధినేత కంచన్ నైకవాడి విజయగాథ ఇది. కొత్త ఏడాది ప్రవేశిస్తున్నపుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఒక సందర్భం కూడా ఉంది. 2013 సీఎంవో ఆసియా ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్‌లో కంచన్ ఉమన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్! అది 1997వ సంవత్సరం. నిండు గర్భిణి అయిన కంచన్ ప్రసవం కోసం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ అయిపోయింది. బిడ్డను చూసుకుని మురిసిపోతోంది! కానీ అంతలోనే విషాదకర వార్త ఆమె చెవికి చేరింది! క్యాన్సర్ కారణంగా తండ్రి చనిపోయాడు. నిజానికి కంచన్ తండ్రి ఒక రోజు ముందే చనిపోయారు. ప్రసవం సమయంలో కంచన్ కుంగిపోతుందేమో అని ఎవరూ ఆమెకు చెప్పలేదు. ఆమెను సముదాయించడం ఎవరి తరం కాలేదు. రెండేళ్లు గడిచినా తండ్రి జ్ఞాపకాలు ఆమెను వదిలి వెళ్లలేదు. ఏ జబ్బునైనా ముందుగా గుర్తిస్తే దాని నివారణ సాధ్యమేనని తెలుసుకుంది. ఆ దిశగా ఓ ముందడుగు వేయాలనుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె ‘ఇండస్ హెల్త్ ప్లస్’ అనే ముందస్తు ఆరోగ్య పరీక్షల సంస్థను నెలకొల్పింది. నలుగురు వైద్య సిబ్బందిని నియమించుకుంది. తనేమీ వైద్యురాలు కాకపోయినా.. వైద్య రంగానికి సంబంధించి ఏ అనుభవమూ లేకున్నా కంచన్.. ధైర్యంగా ముందడుగు వేసింది. ఐతే ఏ జబ్బూ లేకుండా పరీక్షలు చేయించుకునేందుకు మొదట్లో జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. డబ్బు విషయంలో ఆమె ఎవరినీ ఒత్తిడి చేయలేదు. పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించి.. అందరూ చెకప్ చేయించుకునేందుకు ముందుకొచ్చేలా చేసింది. బంధువర్గం తర్వాత మిగతా జనాలపై దృష్టిపెట్టింది. తన బృందంతో వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించింది కంచన్. క్రమంగా జనాల్లోనూ అవగాహన పెరిగి.. పరీక్షలకు ముందుకొచ్చారు. ఈ పదమూడేళ్ల కాలంలో ‘ఇండస్ హెల్త్ ప్లస్’ ఇంతింతై.. అన్నట్లు ఎదిగింది. సిబ్బంది సంఖ్య నాలుగు నుంచి నాలుగొందలకు చేరింది. సంస్థ టర్నోవర్ రూ.100 కోట్లు దాటింది. 50 లక్షలకు పైగా కుటుంబాలు ఇండస్ హెల్త్ ప్లస్‌లో పరీక్షలు చేయించుకున్నాయి. 400కు పైగా కంపెనీలు ఆ సంస్థకు క్లైంట్లుగా ఉన్నాయి. సంస్థ ఎదుగుదలతో పాటే కంచన్కు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆమెను అనేక అవార్డులు వరించాయి. 2013 సీఎంవో ఆసియా ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్‌లో ‘ఉమన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం కంచన్ సొంతమైంది. ‘‘ఇండస్ హెల్త్ ప్లస్‌ను డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఆరంభించలేదు. జనాలకు వైద్య పరీక్షల ప్రాధాన్యం తెలియాలి, జబ్బుల్ని ముందే నివారించాలి అన్నది నా ఉద్దేశం. నా లక్ష్యం దిశగా సాగే క్రమంలో సంస్థ కూడా ఉన్నత స్థితికి చేరింది. దీని వల్ల స్వామి కార్యం, స్వకార్యం నెరవేరినట్లయింది’’ అంటారు కంచన్. ప్రకాష్ చిమ్మల