'నటిగా రాణించనేమోనని భయపడ్డా' | I thought I didn't have personality to become actress Sonam Kapoor | Sakshi
Sakshi News home page

'నటిగా రాణించనేమోనని భయపడ్డా'

Published Fri, Dec 18 2015 9:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నటిగా రాణించనేమోనని భయపడ్డా' - Sakshi

'నటిగా రాణించనేమోనని భయపడ్డా'

ముంబై: నటికి కావాల్సిన  శరీరాకృతి తనకు లేదని సినిమాల్లోకి రాకముందే భయపడేదాన్నని, నటిగా రాణిస్తానన్న ఆత్మవిశ్వాసం అప్పట్లో లేదని  బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ చెప్పింది. సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించినా, నిజజీవితంలో తనది బిడియ స్వభావమని అంది.

'ప్రతి విషయానికి భయపడేదాన్ని. బిడియ స్వభావం వల్ల ఇతరులతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నటికి కావాల్సిన అందం నాలో లేదని భావించేదాన్ని. సినీ పరిశ్రమలోకి వచ్చాక ఈ బలహీనతలను క్రమంగా అధిగమించాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి' అని సోనమ్ కపూర్ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement