Amazon Prime Video Now Lets You Change Profile Photo To Characters From Movies Series - Sakshi
Sakshi News home page

Amazon Prime: అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ కొత్త ఫీచర్‌ గమనించారా?

Published Sat, Aug 21 2021 4:45 PM | Last Updated on Sat, Aug 21 2021 8:01 PM

Amazon Prime Video Now Lets You Change Profile Photo To Characters From Movies Series - Sakshi

అమెజాన్‌ ప్రైమ్‌ గురించి తెలియని వారు ఎవరుండరు అనుకుంటా బహుశా..! అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వీడియో, మ్యూజిక్‌, ఫాస్టెస్ట్‌ డెలివరీ సేవలను అమెజాన్‌ తన కస్టమర్లకు అందిస్తోంది. తాజాగా అమెజాన్‌ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మీకు నచ్చిన వెబ్‌ సిరీస్‌, సినిమాల్లోని ఇష్టమైన క్యారెక్టర్‌ను మీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రొఫైల్‌ పిక్చర్‌ను ఎంచుకోవచ్చును. ఈ ఫీచర్ భారత్‌లో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్ల అందరికీ అందుబాటులో ఉండనుంది. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!)


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రొఫైల్‌ పిక్చర్‌లో భాగంగా ప్రస్తుతం మార్వెలస్ మిసెస్ మైసెల్ నుంచి మిడ్జ్ ది బాయ్స్ నుంచి మదర్స్ మిల్క్ (లాజ్ అలోన్సో) వంటి పాత్రలను ప్రోఫైల్‌ పిక్చర్‌గా మార్చుకొవచ్చును. అంతేకాకుండా ఫ్లీబాగ్‌, ఇన్విన్సిబుల్‌, సిల్వీస్‌ లవ్‌, టామ్‌ క్లాన్సి నటించిన జాక్‌ రైన్‌, టూమరో వార్‌ వంటి సిరీస్‌, చిత్రాల్లో నటించిన వారి క్యారెక్టర్లను ప్రొఫైల్‌ ఫోటోలుగా ఉంచుకోవచ్చును.

ప్రస్తుతం  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కేవలం హలీవుడ్‌కు చెందిన ప్రముఖ క్యారెక్టర్లను ప్రొఫైల్‌ పిక్స్‌గా ఉంచుకోవడానికి అనుమతిని ఇస్తుంది. త్వరలోనే ఇండియన్‌ సినిమాకు చెందిన క్యారెక్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో అమెజాన్‌ ఉన్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, వెబ్‌సైట్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రొఫైల్‌ చిత్రాన్ని ఇలా ఛేంజ్‌ చేయండి....!

  • మీ ఫోన్‌లో ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోను ఒపెన్‌ చేయండి.
  • ప్రైమ్ వీడియో యాప్‌లో హోమ్‌పేజీ దిగువన ఉన్న మై స్టఫ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. 
  • తరువాత ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేసి, ఆపై మేనేజ్‌ ప్రొఫైల్‌ను ఎంచుకోండి . మీరు మార్చాలనుకుంటున్న ప్రొఫైల్‌ని ఎంచుకోండి (ఒకవేళ మీకు ఒక అకౌంట్‌పై ఎక్కువ ప్రొఫైల్‌లు ఉంటే).
  • తరువాత ఎడిట్ ప్రొఫైల్‌ను ఎంపిక చేయండి.  మీకు మీ పేరుతో కూడిన ప్రోఫైల్‌ పిక్చర్‌ను గమనిస్తారు. అక్కడ ప్రోఫైల్‌ పిక్‌పై క్లిక్‌ చేసి మీకు నచ్చిన సిరీస్‌, చిత్రానికి సంబంధించిన క్యారెక్టర్‌ను ప్రొఫైల్‌ ఫోటోను ఎంపిక చేయండి. తరువాత సేవ్‌ చేయండి. 

(చదవండి: ఎలన్‌ మస్క్‌ కొత్త ప్లాన్‌.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement