
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ హీరోయిన్గా మారింది హాట్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్తలు ఎప్పటినుంచో బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రియుడు, వ్యాపార వేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 27న వివాహం చేసుకోనున్నట్లు గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలు నిజమే అని నిరూపించేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో గింగిరాలు తిరుగుతోంది.
ఇటీవల మౌనీ రాయ్ ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది. వారి కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది మౌని. ఈ క్రమంలోనే ఒక ఫొటోగ్రాఫర్ మౌనీకి 'అభినందనలు' అని తెలిపాడు. దానికి మౌనీ నవ్వుతూ 'థ్యాంక్యూ' అని చెప్పింది. అంతేకాకుండా ఆ ఫొటోగ్రాఫర్ 'పెళ్లి తర్వాత కలుద్దాం' అని కూడా చెప్పడం విశేషం. ఈ సంఘటన బట్టి మౌనీ రాయ్ పెళ్లి పుకార్లు నిజమే అని సూచిస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ల వివాహం జనవరి 27న జరగనుందని సమాచారం.
వీరిద్దరూ బెంగాలీ వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. ఎందుకంటే సూరజ్ దుబాయ్‌కి చెందిన ఓ బ్యాంకర్, వ్యాపారవేత్త. అతడు బెంగళూరులో జైన్ కుటుంబానికి చెందిన వాడని సమాచారం. అందుకే వరుడి మత సాంప్రదాయాల ప్రకారం వివాహం జరగనున్నట్లు బాలీవుడ్ టాక్.