
Samantha And Karthi To Pair Up For Kollywood Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. విభిన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో వైవిధ్య పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా సమంత మరో కోలీవుడ్ స్టార్ హీరో పక్కన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతనెవరో కాదు కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ తమిళ హీరో కార్తి.
కార్తి సరసన నటించేందుకు సమంతను సంప్రదించినట్లు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాను తమిళ చిత్రం 'బ్యాచిలర్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ సెల్వకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిందట. ఈ చిత్రంలోనే కార్తీ పక్కన జంటగా నటించేందుకు సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment