విజయ్ సినిమాకు షాకిచ్చిన సెన్సార్‌ బోర్డ్.. ఆ సీన్లు కట్! | Tamil Star Vijay Movie Leo Song Censor Board Cuts Several Scenes - Sakshi
Sakshi News home page

Leo Song: లియో చిత్రానికి షాక్.. ఆ సీన్స్ తొలగింపు!

Published Mon, Sep 11 2023 3:23 PM | Last Updated on Mon, Sep 11 2023 4:25 PM

Tamil Star Vijay Movie Leo Song Sensor Board Cuts Several Scenes - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా త్రిష, ప్రియా ఆనంద్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో సంస్థ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 19వ తేదీన విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

(ఇది చదవండి: ఫైర్‌ మీదున్న అమర్‌.. రెండో వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?)

అనిరుధ్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని నాన్‌ రెడీ వరవా అనే పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. అయితే ఈ పాట మొదటి నుంచి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే  ఈ పాటలో విజయ్‌ పొగ తాగే సన్నివేశాలతో పాటు వివాదాస్పద పదాలు చోటు చేసుకోవడంతో పలు తమిళ సంఘాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

ముఖ్యంగా అనొచ్చు మక్కళ్‌ కట్చి నిర్వాహకురాలు రాజేశ్వరి ప్రియ చిత్రంలోని నాన్‌ రెడీ పాటకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్‌ సభ్యులు ఆ పాటలోని కొన్ని అభ్యంతర సన్నివేశాలను.. పాటలోని వివాదాస్పద పదాలను కట్‌ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్‌ సిగరెట్‌ పట్టుకుని క్లోజప్‌ సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. అయితే ఈ పని పాట విడుదలకు ముందే చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా..  బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ , దర్శకుడు మిష్కిన్‌, గౌతమ్‌ మీనన్‌, మన్సూర్‌ అలీఖాన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

(ఇది చదవండి: స్టైలిష్‌ లుక్‌లో ఉపాసన.. డ్రెస్‌ ధరెంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement