నగ్న సత్యాలు... | The naked truth ... | Sakshi
Sakshi News home page

నగ్న సత్యాలు...

Mar 20 2014 11:52 PM | Updated on Sep 2 2017 4:57 AM

నగ్న సత్యాలు...

నగ్న సత్యాలు...

కథానాయిక కావాలనేది ఆ అమ్మాయి కల. ఎన్నో ఆశలతో నగరానికి చేరుకుంది. కొంతమంది స్వార్థపరులు, రాజకీయ నాయకులు ఆమెకు మరో రకంగా సినిమా చూపించారు.

కథానాయిక కావాలనేది ఆ అమ్మాయి కల. ఎన్నో ఆశలతో నగరానికి చేరుకుంది. కొంతమంది స్వార్థపరులు, రాజకీయ నాయకులు ఆమెకు మరో రకంగా సినిమా చూపించారు. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘నగ్న సత్యం’.


వీణామాలిక్ కథానాయికగా కూరపాటి రామారావు దర్శకత్వంలో చదవలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ‘నగ్నసత్యం’ ప్రచార చిత్రం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లోని కొన్ని దుష్టశక్తుల కారణంగా గత పదహారేళ్లుగా మా అనురాధ ఫిలిమ్స్ సంస్థలో సినిమాలు తీయలేకపోయాం.


‘నగ్న సత్యం’ షూటింగ్ పూర్తయి చాలా కాలమైంది. సెన్సార్ బోర్డ్ కూడా సెన్సార్ చేయడానికి తిరస్కరించింది. గట్టిగా పోరాడటంతో కనికరించి సెన్సార్ చేశారు. ఎన్నో నగ్న సత్యాలను ఈ సినిమాలో చూడొచ్చును’’ అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement