యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలన నెలకొన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల దేవర ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసేందుకు సెన్సార్ బోర్డ్ ఓకే చెప్పింది. అయితే ఈ చిత్రంలో నాలుగు మార్పులు చేయాలని మేకర్స్‌కు సెన్సార్ బోర్డ్ సూచించింది. ఇందులో ప్రధానంగా భార్య, తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్‌ను మార్చాలని ఆదేశించింది. అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెన్స్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో సొరచేపను స్వారీ చేస్తున్న సీన్‌కు మేడ్ విత్ సీజీఐ అనే డిస్‌క్లైమర్ వేయాలని దేవర టీమ్‌కు తెలిపింది. ఈ సన్నివేశంలో ఎలాంటి జంతుహింస జరగలేదని టిక్కర్ వేయాలని వివరించింది. ఈ మార్పులతో దేవర మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. కాగా.. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 58 నిమిషాలు ఉండనుంది.
కాగా.. ఈ యాక్షన్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విలన్‌గా అభిమానులను మెప్పించనున్నారు. నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. యూఎస్‌లో రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment