లేడీ సూపర్ స్టార్ నయనతార, జయం రవి జంటగా నటించిన చిత్రం ఇరైవన్. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని గాడ్ పేరుతో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ లాంఛ్‌లో పాల్గొన్న జయం రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు.
(ఇది చదవండి: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!)
జయం రవి మాట్లాడుతూ..' అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం అందించే లక్ష్యంతో సినిమాలు చేస్తున్నాం. అయితే ఇరైవన్ (గాడ్) చిత్రాన్ని మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దు. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి చిన్న పిల్లలు భయపడే అవకాశం ఉంది. మా సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్‌లోనే చూపించాం. కొంతమంది ప్రేక్షకులు ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా.' అని అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గతంలో నాకు ఓ కథ చెప్పారు. అది అనివార్య కారణాలతో చేయలేకపోయాను. అతనికి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఇకపోతే నాకు డైరెక్షన్ చేయాలనే ఉంది.. భవిష్యత్తులో అవకాశం వస్తే విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని తెలిపారు.
(ఇది చదవండి: 800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..)
Comments
Please login to add a commentAdd a comment