Ram Charan Jr NTR Rajamouli RRR Movie Sensor Report And Lengthiest Runtime - Sakshi
Sakshi News home page

RRR Update: 'ఆర్‌ఆర్‌ఆర్‌' సెన్సార్ పూర్తి.. ఆ విషయంలో బాహుబలి-2 కంటే ఎక్కువే..!

Published Fri, Mar 18 2022 12:20 AM | Last Updated on Fri, Mar 18 2022 10:28 AM

Ram Charan Jr NTR Rajamouli RRR Movie Sensor Report and Runtime - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఇక ఈ చిత్రం ఇంకో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో దాని రిపోర్ట్ బయటకు వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్ర రన్‌టైమ్‌ విషయంలో ఏకంగా 'బాహుబలి-2'ను మించిపోయినట్టు తెలుస్తోంది.

ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా రన్‌టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు కాగా రాజమౌళి గత చిత్రం 'బాహుబలి ది కంక్లూజన్' రన్‌టైమ్ 2 గంటల 47 నిమిషాలు. అంటే మధ్యలో ఇంటర్వెల్‌తో కూడా కలుపుకుని మూడున్నర గంటలు 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం థియేటర్లలో ప్రదర్శితం కానుంది. ఇక మెత్తంగా చూస్తే 'బాహుబలి-2' కంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌' రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement