40 ఏళ్ల బ్యూటీ.. లిప్‌లాక్‌ సీన్‌.. ఇంకా అవుట్ కాలేదు..! | Trisha Krishnan Tweet Goes Viral On Thalapathy Vijay LEO Movie Box Office Collections, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Trisha Tweet On LEO Collections: హీరోయిన్‌గా 20 ఏళ్లు.. అయినా తగ్గేదేలే అంటోన్న బ్యూటీ!

Published Sat, Oct 28 2023 8:04 AM | Last Updated on Sat, Oct 28 2023 10:05 AM

Trisha Krishnan Tweet Goes Viral Vijay Movie Leo Collections - Sakshi

హీరోయిన్‌గా రెండు దశాబ్దాల పాటు కొనసాగడం అంటే ఆషామాషీ కాదు. అది కూడా అగ్రస్థానంలో అది దక్షిణాది సినిమాలో ఒక్క త్రిషకే దక్కిందని చెప్పేయొచ్చు. జోడి అనే తమిళ చిత్రంలో కథానాయకి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా రెండు మూడు సన్నివేశాల్లో తళుక్కుమన్న త్రిష దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించింది. స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంటుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు.

(ఇది చదవండి: ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!)

అలాంటి త్రిష ఒక్కో చిత్రంతో కన్నడ, హిందూ సినీ అభిమానులను పలకరిస్తుందని కూడా అనుకొని ఉండరు. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్‌ కమలహాసన్‌, విజయ్‌, అజిత్‌, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. అలా 40 ఏళ్ల బ్యూటీ నేటికీ నాటౌట్‌గా నిలిచి హీరోయిన్‌గా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో విక్రమ్‌, జయంరవి, కార్తీ, ప్రభు, ప్రకాష్‌రాజ్‌, బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్వారాయ్‌ వంటి దిగ్గజాలతో కలిసి నటించి యువరాణి కుందవైగా అందం, అభినయంతో తనదే పైచేయిగా అనిపించుకున్నారు. అంతే ఆ తర్వాత త్రిషకు క్రేజీ అవకాశాలు వరుస కడుతున్నాయి. 

తాజాగా విజయ్‌ సరసన నటించిన లియో చిత్రం ఇటీవల విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా లియో చిత్రంలో నటుడు విజయ్‌తో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించి అభిమానులకు స్వీట్‌ షాక్‌ ఇచ్చారు. కాగా ఈ చిత్ర ఒక వారం వసూళ్లను నిర్మాత అధికారికంగా విడుదల చేశారు. అది చూసిన త్రిష పోలా అదిరిపోలా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

(ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా? )

ఈ సందర్భంగా ఆమె లియో చిత్రంలో నటించిన కొన్ని ఫొటోలను వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. త్రిష ప్రస్తుతం మరో స్టార్‌ నటుడు అజిత్‌ సరసన విడాముయర్చి చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement