విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Thalapathy Vijay And Lokesh Kanagaraj Leo Movie Likely To Release In OTT On This Date, Deets Inside - Sakshi
Sakshi News home page

Leo Movie OTT: లియో మూవీ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ అప్పుడే!

Published Wed, Oct 25 2023 9:25 PM | Last Updated on Thu, Oct 26 2023 9:21 AM

Leo Movie OTT Release Date Vijay Lokesh Kanagaraj - Sakshi

దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'లియో'. లోకేశ్ కనగరాజ్ దీనికి డైరెక్టర్ కావడం వల్ల విడుదలకు ముందే ఎక్కడలేని హైప్ వచ్చింది. తీరా గతవారం థియేటర్లలో రిలీజైతే.. ప్రేక్షకులు అనుకున్నంతగా నచ్చలేదు. అయితేనేం వసూళ్లు రూ.300 కోట్ల  ఎప్పుడో దాటిపోయాయి. ఇలా థియేటర్లలో ఉండగానే తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

'లియో' సంగతేంటి?
తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. 'LCU' పేరుతో డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. వీటికి లింక్ చేస్తూ 'లియో' మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై ఓ రేంజులో అంచనాలు ఏర్పడ్డాయి. మ్యూజిక్, టేకింగ్ విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ చిత్రం.. కథ, కథనాల విషయంలో మాత్రం ఫెయిలైందనేది కొందరు ప్రేక్షకుల వాదన.

(ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!)

కథేంటి?
పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్‌కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ.

ఓటీటీలోకి అప్పుడేనా?
ఇకపోతే థియేటర్ రిలీజ్‌కి ముందే 'లియో' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్‌లో భాగంగానే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది.

(ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement