విజయ్ చిత్రాలు విడుదలకు ముందు ఆ తర్వాత కూడా వివాదాస్పదం కావడం కొత్తకాదు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన లియో కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాస్టర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మేనన్, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల)
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రం సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఇక ఎలాంటి సమస్య లేదు అనుకుంటున్న సమయంలో లియో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో విజయ్ చెప్పే పవర్ ఫుల్ డై లాగ్స్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది. అయితే ఇందులో విజయ్ చెప్పిన కొన్ని అనుచిత డైలాగులే ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీస్తున్నాయి.
వీటిపై ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఆ సంభాషణలతో నటుడు విజయ్‌కి ఎలాంటి సంబంధం లేదని, ఈ డైలాగులు చెప్పాలా అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారని, తానే కథకు అవసరమని ఒప్పించానని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అవి విజయ్ చెప్పిన సంభాషణ కాదని, లియో చిత్రంలోని పార్తిపన్ అనే పాత్ర చెప్పిన సంభాషణలని పేర్కొన్నారు. దానికి తానే బాధ్యత వహిస్తున్నానన్నారు.
అయితే చిత్ర టైలర్‌లో చోటు చేసుకున్న ఆ వివాదాస్పద సంభాషణలు చిత్రంలో మ్యూట్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే నటుడు విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ల మధ్య విభేదాలు అంటూ ఒక పోస్టు ట్విట్టర్లో వైరల్ అయ్యింది. దాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ లైక్ కొట్టడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇక ఈ ట్వీట్‌ను రజనీకాంత్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. తాను ఆ ట్వీట్‌ను సరిగా చూడకుండా లైక్ కొట్టారని, అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆయన మరో ట్వీట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment